పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా పీరియాడికల్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడ అవుతోంది.
అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరోసారి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు పవన్.
ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నాడట.ఈ సినిమాలో గబ్బర్ సింగ్ చిత్రంలోని మెజారిటీ అంశాలను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్.
ఈ మేరకు పవన్‌తో డిస్కషన్ కూడా జరిగిందట.
అటు ఎంటర్టైనింగ్ పాత్రలో నటిస్తూనే పొలిటికల్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది.
ఈ సినిమాతో పవన్ రాజకీయంగా కూడా ప్రజలను టచ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.ఇక పవన్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.