రచయితగా మారుతున్న పవన్ కళ్యాణ్.. ఆ మూవీ కోసమే..?  

pawan kalyan become writer for ayyappaanm koshium remake, ayyappanum koshiyum, pawan kalyan,rana daggubati, sagar chandra, trivikram - Telugu Ayyappanum Koshium Remake, Ayyappanum Koshiyum, Pawan Becomes Writer, Pawan Kalyan, Pawan Kalyan Become Writer For Ayyappaanm Koshium Remake, Rana Daggubati, Sagar Chandra, Script, Trivikram

అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమా సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

TeluguStop.com - Pawan Kalyan To Become Writer For Ayyappanum Koshium Remake Movie

వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఒక సినిమాలో నటిస్తున్నారు.

మలయాళంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కథ, కథనాల్లో మార్పులు చేర్పులు చేస్తూ తన పెన్ పవర్ ను చూపిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు పవన్ రచయితగా వ్యవహరించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండగా టైటిల్స్ లో రచయితగా పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తుందో లేదో చూడాల్సి ఉంది.సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలలో సహాయసహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

TeluguStop.com - రచయితగా మారుతున్న పవన్ కళ్యాణ్.. ఆ మూవీ కోసమే..-Gossips-Telugu Tollywood Photo Image

పవన్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మల్టీస్టారర్ సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు రానా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని తెలుస్తోంది.దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

సాగర్ చంద్ర అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు గతంలో దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా దర్శకునిగా సాగర్ చంద్రకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

#Sagar Chandra #Trivikram #PawanKalyan #PawanBecomes #Script

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు