పవన్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు!

Pawan Kalyan To Become Fully Active In Politics From 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల పాటు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ వెండితెరపై కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేసాడు.

 Pawan Kalyan To Become Fully Active In Politics From 2023-TeluguStop.com

ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.ప్రెసెంట్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.

దీంతో పాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం‘ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Pawan Kalyan To Become Fully Active In Politics From 2023-పవన్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.

Telugu Bheemla Nayak, Janasena, Pawan Kalyan, Pawankalyan, Pawan Kalyan, Pspk-Movie

ఇక ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా సాగుతుండగానే మరొక సినిమాను అనౌన్స్ చేసాడు.గబ్బర్ సింగ్ కాంబోలో మరొక సినిమా రాబోతుంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనౌన్స్ చేసాడు.ఇక సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు త్వరగా పూర్తి చేసి హరీష్ శంకర్ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఆతృతగా ఉన్నాడు.

Telugu Bheemla Nayak, Janasena, Pawan Kalyan, Pawankalyan, Pawan Kalyan, Pspk-Movie

ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.పవన్ ప్రెసెంట్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలను కూడా మేనేజ్ చేస్తున్నాడు.అయితే ప్రెసెంట్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఇక ఫుల్ టైమ్ రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టాలని అనుకుంటున్నాడట.వచ్చే ఎన్నికల నాటికీ పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి 2023 నుండి పూర్తి సమయం రాజీకీయాలకే కేటాయించ బోతున్నాడట.

ఇక ఈ నిర్ణయాన్ని పవన్ అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు.తమ అభిమాన హీరోని ఇక వెండితెర మీద చూసే అవకాశం ఉండదని పవన్ అభిమానులు వర్రీ అవుతున్నారు.

#Janasena #Pawan Kalyan #Bheemla Nayak #PawanKalyan #PSPK

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube