పవన్ మూడు సినిమాల షెడ్యూల్‌ ఖరారు

పవన్ కళ్యాణ్ వకీల్‌ సాబ్‌ తర్వాత వెంటనే మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని కరోనా కారణంగా ఆ రీమేక్ షూటింగ్‌ ఇంకా పూర్తి అవ్వలేదు.

 Pawan Kalyan Three Movies Shooting Schedule Fix-TeluguStop.com

షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయిన ఆ సినిమా తో పాటు హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ కూడా మొదలు అయ్యింది.కరోనా కారణంగా ఆ సినిమా కూడా నిలిచి పోయింది.

పవన్‌ ప్రస్తుతం ఆ సినిమాల షూటింగ్ లకు జాయిన్‌ అయ్యేందుకు పూర్తిగా సిద్దం అయ్యాడు.పవన్ మూవీ చిత్రీకరణ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Pawan Kalyan Three Movies Shooting Schedule Fix-పవన్ మూడు సినిమాల షెడ్యూల్‌ ఖరారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో పవన్‌ మరియు హరీష్‌ శంకర్ ల కాంబో మూవీకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ మూడు సినిమాలు కూడా ఇదే ఏడాది షూటింగ్‌ లకు గుమ్మడి కాయ కొట్టాలి అనేది పవన్‌ ప్లాన్‌.

అందుకు గాను పక్కా షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

కరోనా థర్డ్‌ వేవ్‌ రాకుండా ఉంటే అన్నట్లుగా పవన్ టీమ్‌ షెడ్యూల్‌ ను ఖరారు చేయడం జరిగింది.

ప్రస్తుతం పవన్‌ షూటింగ్‌ కు రెడీ గా ఉన్నాడు కనుక వెంటనే మలయాళం సినిమా రీమేక్‌ ను పూర్తి చేయబోతున్నాడు.దాదాపుగా నెల రోజుల పాటు ఆ సినిమా షూటింగ్‌ లో పవన్‌ పాల్గొంటాడట.

అదే సమయంలో మరో షిప్ట్‌ వర్క్‌ చేసి కొన్ని రోజుల పాటు హరి హర వీరమల్లు సినిమా కూడా చేయబోతున్నారు.ఇక పవన్‌ సినిమా ల చిత్రీకరణ రెండు కూడా చక చక జరుగుతున్న సమయంలోనే జులై లేదా ఆగస్టులో హరీష్‌ శంకర్‌ మూవీ పట్టాలెక్కించే అవకాశం ఉంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ను ముగించుకుని హరీష్‌ శంకర్‌ సిద్దంగా ఉన్నాడు.

మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని హరీష్‌ శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.అందుకు సంబంధించి ఇప్పటికే పక్కా ప్లానింగ్‌ ను చేయడం జరిగిందట.మొత్తానికి మూడు సినిమాల షూటింగ్‌ లు కూడా ఇదే ఏడాదిలో ముగించేయనున్నారు ఒకటి ఈ ఏడాది లో విడుదల చేస్తారట.

ఇక హరి హర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుండగా వచ్చే ఏడాది సమ్మర్‌ లో హరీష్‌ శంకర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ షెడ్యూల్‌ ఎంత వరకు సాఫీగా సాగుతుందో చూడాలి.

#Harish Shankar #HariHara #Fim #Krish #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు