పవర్ స్టార్ పవన్ కల్యాణ్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు.
ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతారు.చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా పవన్ తో జతకట్టాలి అనుకుంటారు.
చాలా మంది టాలీవుడ్ ప్రొడ్యూసర్ల డ్రీమ్ కూడా అదే.హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ తో సినిమా అంటే నిర్మాతలకు సేఫ్ అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో.పవన్ కల్యాణ్ సినిమాలు కూడా కలెక్షన్ల పరంగా మంచి దూకుడు కనబరుస్తాయి.ఓపెనింగ్స్ లో రికార్డులు నెలకొల్పడంలో పవన్ కు పవనే సాటి.ప్రస్తుతం పవర్ స్టార్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నాడు.
ప్రస్తుతం పవన్ పలు సిమాలు చేస్తున్నాడు.భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలుచేస్తున్నాడు.వీటిలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.విడుదలకు రెడీ అయ్యింది.
సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నా.రాజమౌళి ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని భావించి వాయిదా వేశారు.
దీంతో పవన్ మూవీ ఫిబ్రవరి 27న శివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాను పని చేస్తున్న నిర్మాతలకు కొన్ని కండీషన్లు పెడుతున్నాడట.దాంతో వాళ్లు తల పట్టుకునే పరిస్థితి నెలకొందట.
ఇకపై సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.ఇకపై ఒక్కో సినిమాకు కేవలం 60 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇవ్వాలని భావిస్తున్నాడట.అందులోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్మాతలకు కండీషన్ పెడుతున్నాడట.
రెండు నెలలకు మించి ఒక్క రోజు కూడా ఎక్కువ సమయం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నాడట.హరీష్ శంకర్ మూవీతో పాటు సురేందర్ రెడ్డి సినిమాలకు సంబంధించి మొత్తం 60 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇస్తానని చెప్పాడట.
దీంతో నిర్మాతలు చాలా టెన్షన్ పడుతున్నారట. 2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడట పవన్.ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.