ప‌వ‌న్ టార్గెట్ ఎన్ని సీట్లు.... రీచ్ అవుతాడా..!

మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీల‌కు దీటుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విజృంభిస్తున్నారు.ప్ర‌జ‌లు త‌మ‌ను ఆశీర్వ‌దిస్తే.

 Pawan Kalyan Targets Seats In Ap-TeluguStop.com

అధికారంలోకి వ‌చ్చేందుకు రెడీ అంటూ ఆయ‌న ఇటీవ‌ల వ్యాఖ్యానించాడు.అయితే, ఆయ‌నకు అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన హంగు, ఆర్భాటాలు ఉన్నాయా? అనేది ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌స్తున్న అంశం.నిజానికి పార్టీ స్థాపించి నాలుగేళ్లు పూర్తి అయినా ఇప్ప‌టికీ.పార్టీకి పూర్తిస్థాయిలో ఎలాంటి కేడ‌ర్ పూర్తిస్థాయిలో లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో పార్టీని అధికారంలోకి తేవ‌డంలో ప్ర‌ధాన భూమిక పోషించే నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుల విష‌యంలోనూ ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు.పైగా వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి తాను మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.అయితే, ఇప్ప‌టికి ఉన్న ప్ర‌ధాన పార్టీల్లో టీడీపీకి మాత్రమే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కీల‌క‌మైన అభ్య‌ర్థులు ఉన్నారు.మిగిలిన ఏ పార్టీకి కూడా వైసీపీ స‌హా దేనికీ.అన్ని నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ కీల‌క‌మైన గెలుపు గుర్రాలులేవు.మ‌రి అలాంటిది జ‌న‌సేన‌కు ఉన్నారా? అంటే ప‌ట్టుమ‌ని 50 సీట్ల‌లో కూడా కీల‌క‌మైన అభ్య‌ర్థులు లేరు.ఈ ప‌రిణామం ప‌వ‌న్‌కు ప్ర‌ధానంగా దెబ్బ‌కొట్టే ప‌రిణామం.

దీంతో ఆయ‌న తాజాగా క‌నీసం 50 చోట్ల నుంచైనా గెలుపు గుర్రం ఎక్కేలా ప్లాన్ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం, విజ‌య‌నగ‌రం, విశాఖ‌ లేదా సీమ‌లోని అనంత‌పురం జిల్లాల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని మ‌రింత‌గా ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.నిజానికి రాజ‌కీయాల్లో గెల‌వాలంటే వ్యూహమే కాదు.

దానికి తోడ‌య్యేలా కార్యాచ‌ర‌ణ కీల‌క‌మే.నిజానికి రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వం కోరుతున్న‌వారు చాలా మందే ఉన్నారు.

కానీ, ప్ర‌త్యామ్నాయంగా వారికి ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు.దీంతో ప‌వ‌న్ ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసేలా కార్యాచ‌ర‌ణను మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అధికార టీడీపీపై ఆయ‌న వ్యూహాత్మ‌క దాడిని మ‌రింత‌గా పెంచాల‌ని డిసైడ్ అయ్యారు.ఇప్ప‌టికే జ‌గ‌న్ ఉన్న సానుభూతి జోలికి పోకుండా.అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ను టార్గెట్ చేయ‌డం ద్వారా ప‌వ‌న్ క‌నీసం 50 స్థానాల్లో నైనా గెల‌వాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.వాస్త‌వానికి 175 నియోజ‌క‌వర్గాల్లోనూ గెల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నా.

అది ఇప్పుడు సాధ్యం కాద‌ని ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని తెలుస్తోంది.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube