“బాలయ్య”ని టార్గెట్ చేసిన “పవన్ కళ్యాణ్”   Pawan Kalyan Targets Balakrishna     2018-01-30   05:50:13  IST  Bhanu C

ఏపీలో పవర్ ఉన్నది ఇప్పుడు ప్రతిపక్షనేత జగన్ కి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి..పవన్ కళ్యాణ్ ఏమి చెప్తే చంద్రబాబు జీ హుజూర్ అనే పరిస్థితికి వచ్చేసింది ఏపీలో టిడిపి పార్టీ..ఎందుకు ఇంతలా పవన్ కి గులాం గిరీ చేయడం అంటే ఈ సారి కూడా పవన్ సపోర్ట్ లేనిదే బాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు..అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకి కావాల్సినవి అన్నీ చంద్రబాబు తో చెప్పి మరీ చేయించుకుంటున్నాడట..అయితే పవన్ కళ్యాణ్ తాజాగా బాబు ని ఇరకాటంలో పెట్టె పెద్ద కోరిక కోరాడు అయితే పవన్ కి అది చిన్న కోరికే కానీ బాబు కి మాత్రం అది పెద్ద కోరిక..ఇంతకీ విషయం ఏమిటంటే

పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటనలో మాట్లాడుతూ నేను ఇంకా ఎక్కడి నుంచీ పోటీ చేయాలో డిసైడ్ చేసుకోలేదు కానే తప్పకుండా అంతపురం జిల్లానే ఎంచుకుని పోటీ చేస్తా అనంతపురం కరువు తీరుస్తా అని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడి నుంచీ పోటీ చేయాలని ఆలోచిస్తే హిందూపురం నియోజకవర్గం అయితే తన గెలుపుకి ఎంతో సునాయాసంగా ఉంటుందని తెలిసిందట..వెంటనే తన మనసులో కోరికని బాబు చెప్పడంతో బాబు కూడా “సై” అన్నారని టాక్.

అయితే బాలయ్య బాబు పై కూడా హిందూపురం లో వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉండటం..అక్కడ ప్రజలలో బాలయ్యపై అసంతృప్తి హెచ్చు మీరడంతో ఎప్పటి నుంచో బాలయ్యని తప్పించడానికి బాబు వేయని ప్లాన్ లేదు సో ఈ వంకతో అయినా బాలయ్యని ఒప్పించి బాబు తన ప్లాన్ ని అమలు చేయనున్నాడని అనుకుంటున్నారు..అయితే ఇవన్నీ గాలి వార్తలని..ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచీ పోటీ చేయాలో డిసైడ్ అవ్వలేదని అంటున్నారు..ఇది నిజంగా నిజమా లేక అబద్దమా అనేది త్వరలోనే తేలిపోనుంది అంటున్నారు పవన్ సన్నిహితులు..