పవన్ తో సురేందర్ రెడ్డి.. 'యథా కాలమ్..తథా వ్యవహారమ్'!

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు సినీ రాజకీయ ప్రముఖుల నుండి అలాగే అభిమానుల నుండి పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుతున్నాయి.

 Pawan Kalyan Surender Reddy Yatha Kalam Thatha Vyavaharam Poster Released, Pawan-TeluguStop.com

మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో బాగా సందడి బాగా చేస్తున్నారు.పవన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా అప్డేట్ లు కూడా ప్రకటిస్తున్నారు.

Telugu Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Pspk, Surender Reddy-Movie

ఇప్పటికే పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేసారు.అలాగే మరొక సినిమా హరిహర వీరమల్లు నుండి కూడా విడుదల తేదీని ప్రకటించి పవన్ కు బర్త్ డే విషెష్ తెలిపారు చిత్ర యూనిట్.ఈ రెండు సినిమాలు ఇంతకు ముందు ప్రకటించినవి కాబట్టి పవన్ అభిమానులు కొద్దీ సంబరాలు మాత్రమే చేసుకున్నారు.కానీ కొత్త సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా అని ఎవ్వరు ఊహించలేదు.అసలు వీరి కాంబో పై ఎలాంటి రూమర్స్ కూడా రాకపోవడంతో ఈ రోజు సినిమా ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసింది.”యథా కాలమ్.తథా వ్యవహారమ్” అనే సంస్కృతంలోని పదాలతో పవన్ బర్త్ డే పోస్టర్ ను విడుదల చేసారు.

Telugu Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Pspk, Surender Reddy-Movie

ఈ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఒక వైపు గన్ ఉండగా మరొకవైపు హైదరాబాద్ నగరం ఉంది.యాక్షన్ కథతో రాబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు సురేందర్ రెడ్డి.

ఈ ప్రీ లుక్ పోస్టర్ తోనే హింట్ ఇచ్చి అంచనాలను పెంచేసాడు.సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబో ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.మొత్తానికి పవన్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందాయనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube