పవన్ నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్‌తోనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

 Pawan Kalyan Surender Reddy Movie On Cards, Pawan Kalyan, Surender Reddy, Trivik-TeluguStop.com

కాగా ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన పవన్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాను తమిళ నిర్మాత ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేయనున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటించనున్నాడు.కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు.

ఆ తరువాత మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేసేందుకు పవన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సురేందర్ రెడ్డి చెప్పిన కథకు పవన్ ఓకే అనేశాడని, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను పవన్ పుట్టినరోజు సందర్భంగా చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా సెట్ అవ్వడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య కారణమని తెలుస్తోంది.

మరి పవన్‌తో సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube