పవన్ కోసం అలాంటి హీరోయిన్‌ను వెతుకుతోన్న సురేందర్ రెడ్డి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో రెండేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తోన్న పవన్, అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan Surender Reddy Movie New Buzz, Pawan Kalyan, Surender Reddy, Pspk28-TeluguStop.com

బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండంతో, వకీల్ సాబ్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఎవ్వరి ఊహలకు అందకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు పవన్ రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్‌తో ఇప్పటివరకు నటించని హీరోయిన్‌ను తీసుకోవాలని దర్శకుడు సురేందర్ రెడ్డి చూస్తున్నాడు.

ఈ మేరకు హీరోయిన్ వేటలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడని, ఈ మేరకు చిత్ర యూనిట్‌కు సూచించాడట.ఇక ఈ సినిమాను నాన్-స్టాప్‌గా షూటింగ్ చేసి పూర్తి చేయాలని చిత్ర యూనిట్భావిస్తోందట.

మరి ఈ సినిమాలో పవన్ సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube