పవన్ సినిమాలో కూడా ఆమెనే లాక్ చేసిన సురేందర్ రెడ్డి!

Pawan Kalyan Surender Reddy Movie Latest Update

సురేందర్ రెడ్డి ప్రెసెంట్ అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

 Pawan Kalyan Surender Reddy Movie Latest Update-TeluguStop.com

ఇప్పటి వరకు అఖిల్ లవర్ బాయ్ గానే కనిపించాడు కానీ ఏజెంట్ సినిమాలో అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టేందుకు సూరీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇటీవలే బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ ఈ సినిమాతో మాస్ హీరో అనిపించు కోవాలని తాపత్రయ పడుతున్నాడు.

ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రెసెంట్ పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు తో, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాడు.

 Pawan Kalyan Surender Reddy Movie Latest Update-పవన్ సినిమాలో కూడా ఆమెనే లాక్ చేసిన సురేందర్ రెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండు సినిమాలు దాదాపు సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

Telugu Agent, Akhil Akkineni, Bheemla Nayak, Harish Shankar, Pawan, Pspk, Surender Reddy-Movie

ఏ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చెయ్యబోతున్నాడు.హరీష్ శంకర్ తో సినిమా చేస్తూనే సురేందర్ రెడ్డి దర్వకత్వంలో సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.సురేందర్ రెడ్డి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు సమాచారం.అయితే అఖిల్ తో చేస్తున్న సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైధ్య ను సూరీ హీరోయిన్ గా తీసుకున్నాడు.

Telugu Agent, Akhil Akkineni, Bheemla Nayak, Harish Shankar, Pawan, Pspk, Surender Reddy-Movie

ఇక పవన్ సినిమాలో కూడా ఈమెనే లాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.సాక్షి వైధ్య నటన, అందం అన్ని కూడా సూరీ ని ఆకట్టుకోవడంతో పవన్ సినిమాకు కూడా ఈమెనే తీసుకోవాలని సూరీ నిర్ణయం తీసుకున్నడంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ రెండు సినిమాలతో సాక్షి వైధ్య కెరీర్ టర్న్ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండవ సినిమా ఛాన్స్ అందుకోవడంతో ఇప్పుడు ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

#Pawan #Harish Shankar #Bheemla Nayak #Surender Reddy #Akhil Akkineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube