తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరం అయ్యింది.ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులు అంతా కూడా స్వచ్చందంగా తప్పుకున్నట్లుగా భావించాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించడంతో పాటు, కొత్త ఉద్యోగస్తులను ఎంపిక చేసే కసరత్తు కూడా ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేసేందుకు అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరపున కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులకు మద్దతు దక్కింది.
ఆర్టీసీ కార్మికులు నేడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జనసేన ప్రతినిధి పాల్గొన్నారు.బంద్ మరియు ఆందోళనలు చేసేందుకు ఆర్టీసీ ఎంప్లాస్ సిద్దం అయిన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.
ఆ సమయంలో పవన్ రోడ్డుపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనబోతున్నాడు.అదే కనుక జరిగితే ఆర్టీసీ ఎంప్లాయిస్‌కు కొండంత బలం చేకూరినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.