పవన్‌ గురించి షాకింగ్‌ పుకార్లు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెల్సిందే.అయితే సినీ వర్గాల్లో నిన్న మొన్నటి నుండి ఒక పుకారు తెగ వినిపిస్తోంది.

 Pawan Kalyan Suffered With Leg Fracture Is Not True-TeluguStop.com

సర్దార్‌ చిత్రీకరణ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ కాళుకు ప్యాక్చర్‌ అయ్యిందని, దాంతో కొన్ని రోజుల పాటు సర్దార్‌ షూటింగ్‌కు బ్రేక్‌ వేయాల్సి వచ్చిందట అంటూ ప్రచారం జరుగుతోంది.అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

పవన్‌ కాళుకు ప్యాక్చర్‌ అయింది అంటూ వచ్చిన వార్తలు కేవలం గాలి వార్తలే అని, పవన్‌ ఆరోగ్యంగా సర్దార్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా డైరెక్షన్‌ టీం ప్రకటించింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.‘పవర్‌’ ఫేం బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను పవన్‌ కళ్యాణ్‌ మరియు ఆయన సన్నిహితుడు శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

పవన్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ నెలలో హైదరాబాద్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసి, వచ్చే నెలలో చివరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.వచ్చే నెలతో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, ఏప్రిల్‌లోనే సినిమాను విడుదల చేయాలని శరత్‌ మారార్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు భావిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube