క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్.. ఎవరికో తెలుసా?  

Pawan Kalyan Strong Warning To Pink Remake Unit-lawyer Saab,pawan Kalyan,pink Remake,venu Sriram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటి నుండి ఆయన అభిమానులు పవన్ మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారా అంటూ ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు.కాగా తాజాగా ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారనడంతో ఎలాంటి సినిమాతో వస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ రీమేక్‌గా సమాధానం లభించింది.

Pawan Kalyan Strong Warning To Pink Remake Unit-Lawyer Saab Pawan Pink Venu Sriram

వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

అయితే ఈ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్‌పై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడట.

షూటింగ్ సెట్‌లోకి చిత్ర యూనిట్ తప్ప ఇతరులను అనుమతించవద్దని చిత్ర యూనిట్‌ను కోరాడట.అంతేగాక ఎలాంటి ఫోటోలు తీసుకోవద్దంటూ చిత్ర యూనిట్‌ను కూడా హెచ్చరించారట.

ఈ నిర్ణయానికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఓకే అన్నాడట.

దీంతో పింకీ రీమేక్ చిత్ర షూటింగ్ సెట్‌లోకి కొత్తవారిని అనుమతించడం లేదని తెలుస్తోంది.

మీడియాను కూడా షూటింగ్ సెట్‌లోకి ప్రవేశం లేకుండా చూస్తున్నారట చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట చిత్ర యూనిట్.

నివేధా ధామస్ మెయిన్ ఫీమేల్ లీడ్‌లో నటిస్తోన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు

Pawan Kalyan Strong Warning To Pink Remake Unit-lawyer Saab,pawan Kalyan,pink Remake,venu Sriram Related....