పవన్ మాటలు... బాబు కి చెమటలు..బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు

సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది అది కూడా మొన్నటివరకు తనతో అంటకాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్ల.టీడీపీని ఇరుకున పెట్టాడంలో జగన్ ని మించిపోయి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు పవన్.

 Pawan Kalyan Strong Counter To Chandrababu Naidu-TeluguStop.com

ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకతతో ఎన్నికలంటేనే భయపడుతున్న బాబు కి పవన్ పక్కలో బల్లెం లా మారాడు.బాబును గౌరవంగా భావిస్తాను, గౌరవంగా ఉంటాను అని చెబుతూనే ఆయన అడ్డమైన మాటలన్నీ అనేస్తున్నాడు.

చంద్రబాబు 65 ఏళ్ల వయసొచ్చిన డబ్బుపైన, పదవులపై నా వ్యామోహం చావలేదని నోటికొచ్చినట్టు తినేస్తున్నాడు.అంతే కాదు ఈ విషయంలో లోకేష్ మీద కూడా బాగా గురిపెట్టి రాజకీయ విమర్శలు చేయడం బాబు తట్టుకోలేకపోతున్నాడు.

లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి చూపించాలని పవన్ గేలి చేస్తున్నాడు.దొడ్డిదారిలో అసెంబ్లీకి వచ్చి.అటునుంచి మంత్రి పదవి కొట్టేశాడంటూ విమర్శించడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.రాష్ట్రంలో అధికారంలోకి చంద్రబాబు రావడం తన గొప్పతనమే అన్నట్టు పవన్ చెప్పుకుంటున్నాడు.“నాడు.అనుభవజ్ఞుడని.

చంద్రబాబుకు నేను మద్దతిచ్చాను.ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అనేకసార్లు అవినీతిపై చెప్పిచూశాను” అని అనడం ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పాటు వెనుక పవన్ హస్తం ఉందని, తనవల్లే ప్రభుత్వం ఏర్పాటైందని పవన్ చెప్పుకోవడం బాబుకి నచ్చడంలేదు.

పవన్ మాటలను సీరియస్ గా తీసుకుని టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.నిజానికి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ఇప్పుడు ఏపీలోకానీ చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టాక ఒంటరిగా పోరాడిందేలేదు.

కొన్నిరోజులు వామపక్షాలతో, తర్వాత బీజేపీ/జనసేనలతో టచ్లో ఉండి అధికారంలోకి వచ్చారు.ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయాలంటే.వచ్చే ఎన్నికల్లోబాబు తనను తాను నిరూపించుకోవాలంటే బాబు ఒంటరిగానే బరిలోకి వెళ్ళాలి.అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బాబు అంతటి సాహసం చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube