పవన్‌ సార్‌ నుండి పిలుపు రాలేదన్న బ్యూటీ  

Pawan Kalyan Sruthi Hasan Gabbar Singh Katamarayudu Tollywood Vakeel Sahebh - Telugu Gabbar Singh, Katamarayudu, Pawan Kalyan, Sruthi Hasan, Tollywood, Vakeel Sahebh

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ గురించి మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంది.షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన ఈ చిత్రంలో చిన్న పాత్ర కోసం శృతి హాసన్‌ను తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.

 Pawan Kalyan Sruthi Hasan Gabbar Singh Katamarayudu Tollywood Vakeel Sahebh

పవన్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొందని, మరో రెండు మూడు రోజుల పాటు ఆమె షూట్‌లో పాల్గొనాల్సి ఉందంటూ వార్తలు వచ్చాయి.వీరిద్దరి కాంబోలో గతంలో గబ్బర్‌సింగ్‌ ఇంకా కాటమరాయుడు చిత్రాలు వచ్చాయి.

గబ్బర్‌సింగ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.కాటమరాయుడు యావరేజ్‌గా నిలిచింది.

పవన్‌ సార్‌ నుండి పిలుపు రాలేదన్న బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మళ్లీ వకీల్‌ సాబ్‌ చిత్రంలో వీరిద్దరు కలిసి నటిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం అనుకున్నారు.అయితే సినిమా షూటింగ్‌లో తాను పాల్గొన్నట్లుగా వస్తున్న వార్తలపై శృతి హాసన్‌ క్లారిటీ ఇచ్చింది. వకీల్‌ సాబ్‌ చిత్రం కోసం అసలు తనను ఎవరు సంప్రదించలేదు.షూటింగ్‌లో ఎలా పాల్గొంటాను అంటూ ఆమె ప్రశ్నించింది.పవన్‌ సార్‌తో నటించడంను ఎంజాయ్‌ చేస్తాను. కాని ఆయన నుండి నాకు కొత్తగా ఎలాంటి ఆఫర్‌ రాలేదని ఆమె పేర్కొంది.

పవన్‌ వకీల్‌ సాబ్‌ చిత్రంలోనే కాకుండా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాలో కూడా శృతిహాసన్‌ హీరోయిన్‌ అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలపై మాత్రం శృతి స్పందించలేదు.

అయితే పవన్‌ నుండి ఎలాంటి పిలుపు అయితే రాలేదు అంటూ పేర్కొంది కనుక హరీష్‌ శంకర్‌ మూవీలో శృతి హాసన్‌ నటిస్తుందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.ఇప్పటి వరకు హరీష్‌ శంకర్‌ ఆమెను సంప్రదించలేదని క్లారిటీ వచ్చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..