అభిమానుల కోసం మోకాళ్ళపై కూర్చున్న పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు.దాదాపు ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతున్న పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోలకు లేదనే చెప్పవచ్చు.

 Pawan Kalyan, Viral Photo, Fan Photo, Vakil Sab Shooting Location, Vakeel Sab Mo-TeluguStop.com

తాజాగా జనసేన పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మరింత అభిమానులు పెరిగిపోయారు.అటు పార్టీ పనులను చూసుకుంటూ, చేతి నిండా సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ తన సింప్లిసిటీ తోనే ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు.పవన్ కళ్యాణ్ ను ఎక్కువ మంది ఇష్టపడటానికి కారణం కూడా అదే అని చెప్పవచ్చు.తన కోసం వచ్చిన అభిమానులతో ఎంతో సహనంగా ఫోటోలు దిగి వారితో మాట్లాడి పంపించడం వల్ల పవన్ కళ్యాణ్ అంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి బాలీవుడ్ తారలు సైతం ఎంతో మంది అతనికి అభిమానులుగా ఉన్నారు.

అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీ యువ హీరోలైన నితిన్, నిఖిల్ వంటి వారు పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానులు అని చెప్పవచ్చు.

Telugu Fan, Pawan Kalyan, Vakil Sab-Movie

ఏ ప్రాంతంలో ఆయన పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతున్నాయంటే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటారు.తన కోసం వచ్చిన అభిమానులతో వీలైనంత వరకు ఫోటోలు దిగడానికి ఇష్టపడతారు.ఇటీవలే తన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల పట్ల పవన్ కళ్యాణ్ చూపించిన ప్రేమకు తన అభిమానులు ఫిదా అయిపోయారు.

తన అభిమానుల కోసం ఏకంగా మోకాళ్లపై కూర్చుని వారితో ఎంతో సరదాగా ఫొటో దిగారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్”వకీల్ సాబ్” చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు.

ఇందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube