నిహారిక పెళ్లిలో పవన్ కళ్యాణ్ కుమారుడిని మీరు చూశారా?

మెగా బ్రదర్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దాదాపు 25ఏళ్ల పాటు ఇండస్ట్రీ లో ఉంటూ, కేవలం తను నటించిన 25 సినిమాలలో ఎక్కువగా ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గకుండా ఉందంటే, పవర్ స్టార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది.

 Pawan Kalyan Son, Akira Nandan, Niharika Marriage, Viral Photos , Niharika Weddi-TeluguStop.com

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు తమ వారసులను వెండితెరకు పరిచయం చేశారు.

మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ హీరోగా ఎప్పుడు పరిచయం చేస్తాడు అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.

కేవలం రెండు మూడు సంవత్సరాలలో అకీరానందన్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారని చెప్పవచ్చు.ప్రస్తుతం అకీరానందన్ వయసు కేవలం 16 సంవత్సరాల అయినప్పటికీ అతని బాడీ ఫిజిక్స్ చూస్తే మాత్రం రామ్ చరణ్, వరుణ్ తేజ్ లను సైతం మించిపోయి ఉన్నాడు.

Telugu Akira Nandan, Niharika-Latest News - Telugu

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు కొంత కాలం దూరంగా ఉన్నాడు.అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్, తన వారసుని సునీల్ హీరోగా ఎప్పుడు పరిచయం చేస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే అభిమానుల కోరిక తొందరలోనే తీరుతుందని చెప్పవచ్చు.నిహారిక వివాహానికి ఉదయపూర్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కళ్యాణ్ తో పాటు అకీరా, ఆధ్య కూడా వచ్చారు.

చాలా కాలం తర్వాత అకీరాను చూసిన మెగా అభిమానులు షాక్ కి గురయ్యారు.పవన్ కళ్యాణ్ పక్కన అకీరా వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలలో అకీరాని చూసిన మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే రాబోయే మరో మెగా హీరో అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

ప్రస్తుతం అఖీరా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube