సాయంలో తండ్రికి తగ్గ తనయుడు.. అకీరా ఏం చేశాడో తెలుసా?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో వివరించలేము.

పవన్ కళ్యాణ్ ఇటు స్టార్ హీరోగా, మరొకవైపు రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు.ఈయన నటించిన భీమ్లా నాయక్ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే.

ఒకవైపు సినిమాలలో రాణిస్తూ మరొకవైపు రాజకీయనాయకుడిగా ప్రతిపక్ష నేతలను ప్రశ్నిస్తూ.యాంగ్రీ పొలిటీషియన్ గా ప్రజలకు సేవలు చేస్తున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత రష్యాకి చెందిన అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నాడు.అయితే రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ కి ఇద్దరు పిల్లలు.

Advertisement

అకీరా నందన్ నందన్ కూడా అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ వేడుకలలో కనిపిస్తూ ఉంటాడు.అయితే సేవా కార్యక్రమాలు చేసే విషయంలో అకీరానందన్ తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకున్నాడు.

ముఖ్యంగా కరోనా సమయంలో చిరంజీవి పవన్, కళ్యాణ్ ఎంతో మందికి సహాయం అందించారు.పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల అకిరా నందన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే జరిగింది.ఈ కార్యక్రమంలో అకీరానందన్ సేవా కార్యక్రమాల గురించి తమ టీచర్స్ కొనియాడారు.ముఖ్యంగా కరోనా సమయంలో అకీరా నందన్ హాస్పిటల్ కి ఆక్సిజన్ సిలిండర్లను దానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు.

అంతే కాకుండా అకీరా ఒక వేగన్.అంటే ఎటువంటి మాంసాహారం కానీ, మాంసంతో తయారు చేసిన పదార్థాలు తీసుకోరు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అంతే కాకుండా మనుషులతో పాటుగానే జీవులకు భూమి మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని నమ్మిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.అంటూ అకీరా గురించి తమ టీచర్స్ కొనియాడారు.

Advertisement

ఇక ఈ విధంగా ఆకీరా గురించి ఈ వార్తలు తెలియడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు