బాబు..ఉక్కు..లండన్..అసలు సీక్రెట్ బయటపెట్టిన పవన్..       2018-06-25   05:52:35  IST  Raghu V

కడపలో ఉక్కు పరిశ్రమ రాలేదని అందుకు గాను టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన దీక్షా విశేషం అందరికి తెలిసిన విషయమే ఉక్కు దీక్ష పేరుతో కడపలో టెంట్ వేసుకుని మరీ దొంగ దీక్షలు చేస్తున్నారు అంటూ వైసీపి ఎదురు దాడి చేస్తోంది..అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిచారు..టీడీపీ పరువుని రోడ్డుకి ఈడ్చి పడేశారు..అసలు ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు…అసలు ఉక్కు పరిశ్రమ తరలి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వమే కదా అంటూ కుదబద్దలు కొట్టారు..పవన్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కి దిమ్మతిరిగిపోయింది..ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

స్టీల్ ప్లాంట్ రాలేదని టీడీపీ నాయకులు గోలలు చేస్తూ నానా రాద్ధాంతం చేస్తున్నారు.. కానీ అసలు టీడీపీ వారి వల్లనే కదా పరిశ్రమ రాలేదు అంటూ పవన్ నిప్పులు చెరిగారు. అప్పట్లో దీని నిర్మాణం కోసం జిందాల్ సంస్థ ముందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శలు చేశారు..అంటే ఫ్యాక్టరీలు రావాలి అంటే మీకు లబ్ది చేకూరాలా లేకపోతే కర్మాగారాలు రాకూడదా అంటూ ధ్వజమెత్తారు..మీ స్వార్ధానికి ప్రాజెక్ట్ లని అడ్డుకుంటూ ఇప్పుడు దొంగ దీక్షకులు చేస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్..

నేను గతంలో వెళ్ళినప్పుడే కడప ఉక్కు కర్మాగారం పై వార్తలు నా చెవిన పడ్డాయని అన్నారు..పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అంటే కమీషన్లు అడుగుతున్నారు అని తన దగ్గర వాపోయారని అన్నారు.. లండన్‌లో తాను పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు తమ ఆవేదనను చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత వాటాలు, పర్సంటేజీలు ఇస్తారని అడిగే స్థాయికి మీ ప్రభుత్వాలు పడిపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తోందని..అందుకే మేము ఎపీకి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

స్టీల్ ప్లాన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఇలాంటి పరిస్థితులని సహించేది లేదని తెలిపారు..జనసేన, సీపీఎం, సీపీఐ లు ఇటువంటి పరిస్థితులని కలిసి కట్టుగా మార్చాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు..తమ మూడు పార్టీలు ఒకే ఆలోచన విధానంతో ఉన్నాయని, తమతో పాటు ఇంకెవరైనా కలిసి వచ్చినా వారితో కలిసి ముందుకెళ్తామని పవన్ తెలిపారు. మూడు, నాలుగు నెలల తర్వాత అందరం కలిసి ఉమ్మడి కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు…పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉక్కు దీక్షకి తుక్కు దీక్షగా మారిపోయింది అంటూ సెటైర్స్ విసురుతున్నారు..