పరిస్థితిని బట్టి డైలాగులు మార్చబడును .. ఇంతేనా పవన్ ..

పార్టీ పెట్టడమే కాకుండా జనాల్లో మద్దతు పెంచుకునేందుకు ఆపసోపాలు పడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ తన మాటల్లో మాత్రం ఇంకా క్లారిటీ పెంచుకోలేదు.అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు.

 Pawan Kalyan Situational Dialogue At Political Meetings-TeluguStop.com

ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడు.? ఏం చెయ్యబోతున్నాడు.? అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇలా అనేక ప్రశ్నలు అందరిలోనూ వ్యర్థం అవుతున్నాయి.రాజకీయాల్లో ఇంతకాలం నుంచి ఉంటున్నా క్లారిటీ మాత్రం ఇంకా పెంచుకోలేదు.

ప్రాంతాన్ని బట్టి రోజుకో రకంగా పొంతనలేని ప్రకటనలు చేస్తూ ప్రజలను, పార్టీ నాయకులను అయోమయానికి గురిచేస్తున్నాడు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా పవన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుండటంతో ఏమి చేయాలో జనసేనలో ఉన్నవారితో పాటు పార్టీలో చేరాలనుకుంటున్న వారు కూడా గందరగోళంలో పడుతున్నారు.తాజాగా పవన్ చేసిన ప్రకటన కూడా ఇలా అయోమయంగానే ఉంది.భీమవరంలో పర్యటిస్తున్న పవన్ కుల సంఘాల నేతలతో మాట్లాడుతూ, సమస్యలపై పోరాటమే అంతిమ లక్ష్యం కానీ అధికారం కాదని స్పష్టం చేశారు.

కేవలం సమస్యలపై పోరాడటానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అంతకు ముందు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో మాట్లాడుతూ, తనకు అధికారం అప్పగిస్తే సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో చేసి చూపిస్తానంటూ పవన్ చేసిన ప్రకటన ఇంకా అందరికీ గుర్తుంది.

అంతుకుముందు అనంతపురం జిల్లాలో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి అధికారమే కావాలా ? అంటూ వేసిన ప్రశ్నతో అందరిలోనూ అయోమయం నెలకొంది.పైగా సమస్యలను పరిష్కరించగలను అనే నమ్మకం ఉంటేనే తనకు ఓట్లు వేయండని కూడా పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇలా ఒకదానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడుతూ అందరిని అయోమయంలో ముంచేస్తున్నాడు.పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టింది ఎందుకోసం ? కేవలం సమస్యలపై పోరాడటం కోసమేనా ? అధికారం అంతిమ లక్ష్యం కాదని చిరంజీవి ఎప్పుడూ చెప్పలేదే ? తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది కూడా అధికారం కోసమే.ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటేనే ఎవరైనా రాజకీయ పార్టీ పెడతారు.అంతేకాని కాలక్షేపం కోసం కాదు కదా ! పవన్ కు అధికారం ముఖ్యం కాకపోయినా ఆ పార్టీలో ఉన్నవారికి చేరబోయే నేతలకు మాత్రం అధికారం కావాలి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube