పవన్ కళ్యాణ్ చెల్లి వాసుకికి ఇంత పెద్ద కూతురు ఉందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ పేరు వింటే చాలు చాలామంది అభిమానులకి పూనకాలు వస్తాయి.

 Pawan Kalyan Sister Vasuki Personal Life Details-TeluguStop.com

అయన స్క్రీన్ మీద కనిపించారంటే చాలు అభిమానుల ఉత్సహానికి అవధులు ఉండవు.మరి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా లో ఆయనకు చెల్లిగా నటించిన వాసుకి అందరికి తెలిసే ఉంటుంది.

సుస్వాగతం తో డీసెంట్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ కొత్త దర్శకుడు అయినా కరుణాకరన్ చెప్పిన కథ నచ్చడం తో తొలిప్రేమ సినిమా స్టార్ట్ అయింది.పవన్ కళ్యాణ్ స్టామినా చూపించిన సినిమా తొలిప్రేమ.

 Pawan Kalyan Sister Vasuki Personal Life Details-పవన్ కళ్యాణ్ చెల్లి వాసుకికి ఇంత పెద్ద కూతురు ఉందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రంలో ఆయనకి చెల్లెలి గా వాసుకి నటించగా, ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి మనల్ని ఎంత గా నవ్వించారో మనందరికీ తెలిసు.ఆ సినిమా లో వాసుకి క్లైమాక్స్ లో తనకి ఇష్టం లేకపోయినా తనని ప్రేమించే అబ్బాయి ని పెళ్లి చేసుకుంటుంది.

ఎందుకు అలా చేసావ్ అని హీరో అడిగితే రేపు మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి కూడా మా అన్నయ్య ని రిజక్ట్ చేస్తే చూడలేను అని చెప్పే డైలాగు ఇప్పుడు చూసిన మనందరికీ ఏడుపు వస్తుంది.అంటే వాసుకి ఆ సినిమా లో ఎలా యాక్ట్ చెసిందో మనం అర్థం చేసుకోవచ్చు.అలాంటి అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా.? ఆనంద్ సాయి అనే ఆర్ట్ డైరెక్టర్ ని, తను ఎవరో కాదు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు.పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి రాకముందు చెన్నై లో ఉన్నపుడు వీళ్లిద్దరు బైక్ మీద చెన్నై అంతా తిరిగే వారట.ఆనంద్ సాయి వాళ్ళ నాన్న చెల్లం కూడా పెద్ద ఆర్ట్ డైరెక్టర్.

అయితే ఆయనతో పాటు ఆనంద్ సాయి కూడా షూట్ కి వెళ్ళేవాడు కానీ ఆయనకి పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు కానీ ఒకరోజు పవన్ కళ్యాణ్ ఆనంద్ సాయి ఇద్దరు శ్రీశైలం వెళ్లి సన్యాసుల్లో కలుద్దాం అని అనుకున్నారట.అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్య.

ఆలా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంటే ఆనంద్ సాయి ని కూడా సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా చేయి నీకు ఆర్ట్ కి సంభందించి బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా అని తన గోకులంలో సీత సినిమాకి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో మాట్లాడి ఆనంద్ సాయి ని సినిమాలో పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా మొత్తం న్యాచురల్ లోకేషన్ లో చేయడం వాళ్ళ ఆనంద్ కి ఏం వర్క్ లేకుండా పోయింది.ఆ సమయం లో మల్లి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాకి ఛాన్స్ ఇచ్చాడు.ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి ఆనంద్ పై నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఆనంద్ ని తీసుకున్నారు.సాంగ్ లో తాజ్ మహల్ సెట్ వేయాల్సి వస్తే అయన సరిగా వేస్తాడో లేదో అని ప్రొడ్యూసర్ బయపడుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చి వాడు వేస్తాడు నాకు నమ్మకం ఉంది అని ప్రొడ్యూసర్ తో చెప్పి ఒకవేళ వాడు సరిగా వేయక పోతే మీ సెట్ కి అయ్యే 12 లక్షలు నా రెమ్యునరేషన్ నుంచి కట్ చేసుకోండి అని చెప్పాడట.

ఆనంద్ దగ్గరికి వచ్చి నీమీద నాకు నమ్మకం ఉంది ఏం బయపడకు సెట్ వేసేయి అని ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళాడట.అలా ఆనంద్ సాయి ఆర్ట్ వేసాడు మంచిపేరు వచ్చింది  దాని తర్వాత చాల పెద్ద మూవీస్ కి కూడా చేసాడు ఆనంద్ సాయి.

ఇలా ఆనంద్ తొలిప్రేమ సెట్ లో ఉన్నపుడు వాసుకి ని చూసి లవ్ చేసి తన ప్రేమ విషయాన్ని వాసుకికి చెప్పి పవన్ కళ్యాణ్ సహకారం తో పెళ్లి చేసుకున్నారు.వీళ్ళకి పెళ్లి తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఇచ్చాడట.పవన్ కళ్యాణ్ చెల్లి వాసుకి ఆనంద్ సాయి తనని చాలా బాగా చూసుకుంటారని చెప్తూ ఆనంద్ బాగా ఎమోషనల్ అని, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ ఉంటాడని చెప్తుంది.

ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాపా ఒక బాబు పాపా హర్షిత ఆనంద్ చాల ఆక్టివ్ వాసుకి హర్షిత డైలీ అక్కాచెల్లాల గొడవపడుతుంటారట .హర్షిత ఆనంద్ ప్రస్తుతం మెడిసిన్ చేస్తున్నారు ఒక మంచి డాక్టర్ అవ్వడమే తన కల అంటూ చెప్తున్నారు.తనకి యాక్టింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు హర్షిత.

ఇక హర్షిత ఆనంద్ మాత్రం వాళ్ళ అమ్మ తొలిప్రేమ సినిమా లో కొంచం ఓవర్ చేసిందని నవ్వుతు చెప్తుంది.

ఇప్పుడు తాను సినిమాలు చేస్తే మా అమ్మ రెమ్యునరేషన్ లో సగం తనకి ఇస్తేనే యాక్టింగ్ చేయనిస్తా లేకపోతే లేదు అని నవ్వుతు చెపుతుంది.వాసుకి గారి అబ్బాయి సందీప్ ఆనంద్ తాను వస్తే ఇండస్ట్రీ కి రావచ్చు అని వాసుకి గారు అంటున్నారు.వాసుకి గారికి మెడిసిన్ చదివే కూతురు ఉందంటే ఎవరు నమ్మట్లేదని చెపుతూన్నారు.

ఒక మంచి క్యారెక్టర్ వస్తే తాను సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు.

#PawanKalyan #Vasuki #TholipremaPawan #Vasuki Daughter #VasukiSecond

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు