పవన్ .. ఎందుకిలా ఫూల్ అవుతున్నావ్..?       2018-06-09   03:30:11  IST  Bhanu C

మానలేదు. టీడీపీ పై విమర్శలు గుప్పించడం ద్వారా పొలిటికల్ మైలేజ్ కొట్టేద్దామని చూస్తున్న ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదువుతూ ఫూల్ అవుతున్నాడు. జనాలనే కాకా అభిమానులకు కూడా ఆయన అజ్ఞానవాసిగానే కనిపిస్తున్నాడు.

జనాల్లో తిరుగుతున్న పవన్ .. చంద్రబాబు సర్కార్ మీద ప్రత్యక్ష దాడి మొదలెట్టాడు. ఈ క్రమంలో ఎలా అయినా ప్రభుత్వం పై బురదజల్లాలని అక్కడి లోకల్ లీడర్స్ చెప్పిన చిన్న చిన్న కారణాలు, అసంపూర్తి వివరాలతో జనసేన కంటెంట్ రైటర్స్ చేస్తున్న పద ప్రయోగాలు కొన్ని సార్లు జనానికి నవ్వు తెప్పిస్తుంటే మరికొన్ని సార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవ్వుల పాలవుతున్నారు. చంద్రబాబుకు నాలుగేళ్ళు మద్దతు ఇచ్చి కలిసి ఉన్న పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ప్రభుత్వం అన్నా. చంద్రబాబు అన్న అవినీతి అనేది ఒక్కటే గుర్తుకు వస్తోంది.

అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ తమ మాటలతో తాను చెప్పేవన్నీ అవగాహనలేని మాటలేనని నిరూపిస్తున్నారు. దానికి పలాసలో ఎటువంటి మచ్చా లేని గౌతు కుటుంబం మీద మొదలెట్టిన ఆరోపణలు మొదలుకొని నిన్నటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వరకూ పవన్ తన అజ్ఞానాన్ని, రాజకీయ అపరిపక్వతను బయటపెట్టుకున్నాడు. మన శ్రీకాకుళం వ్యక్తి భూములు అడిగితే భూములు ఇవ్వలేదని కానీ ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ అనే వ్యక్తికి లోకేష్ భూములు కట్టబెట్టాడని.. ఆ భూముల్ని ఆయన అమ్ముకున్నాడని ఆరోపించి నవ్వులపాలు అయ్యాడు.

“ఫ్రాంక్లిన్ టెంపుల్టన్” అనే పేరు కొంచెం అంతంతమాత్రంగా చదువుకున్న వాళ్లకి కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా. ఇంజినీరింగ్, డిగ్రీలు పూర్తి చేసిన యువతకు.. ఇది ఇంగా బాగా తెలుసు. ఎందుకంటే అమెరికన్ మల్టినేషనల్ కంపెనీ అయిన ” ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌”కు హైదరాబాద్ గచ్చిబౌలిలో చాలా పెద్ద క్యాంపస్ ఉంది. దానిలో ఓ పది వేల మంది వరకూ పని చేస్తారు. ఈ సంస్థ క్యాంపస్‌ను విశాఖలో పెట్టగలిగేలా ఒప్పించింది. ఏపీ ప్రభుత్వం.

హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి.. మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఎలా ప్లస్ అయిందో. విశాఖలోనూ.. ” ప్రాంక్లిన్ టెంపుల్టన్” అలా అవుతుందని ఆంధ్రా ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీలకు కేటాయించే భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు పెట్టుకుంటుంది. ఎక్కువగా ఈ కంపెనీల విషయంలో తక్కువ మొత్తానికి లీజుకిస్తారు. ఒక వేళ భూములు రాయితీ ధరకు ఇచ్చేసినా.. అమ్ముకోవడానికి. బ్యాంకుల్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు . పూర్తి స్థాయిలో కంపెనీని ఏర్పాటు చేసి.. హామీల ప్రకారం ఉద్యోగాలు కల్పించిన తర్వాతే.. ఆ భూములపై పూర్తి హక్కులు వచ్చేలా.. నిబంధనలుంటాయి.

అలాగే 33 దేశాల్లో 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగున్న, ఫార్చ్యూన్‌-500 కంపెనీ, వైజాగ్ లో కంపెనీ పెట్టమని భూమి ఇస్తే, అది అమ్ముకుంటుందా ? ఇవన్నీ పవన్ కల్యాణ్‌ తెలుసుకోకుండానే. విశాఖలో “ఫ్రాంక్లిన్ టెంపుల్టన్” కి భూములిచ్చారు కాబట్టి.. అవినీతి జరిగిపోయిందన్న ఉద్దేశంతో ఆరోపణలు చేసేశారు.ఇలా పవన్ తన తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకుంటూ పొలిటికల్ కమెడియన్ గా మారాడు. ఇలాగే ఎన్నికల వరకు వెళ్తే పవన్ కు దిమ్మతిరగడం ఖాయం.