ఇవ‌న్నీ ప‌వ‌న్‌కు ముందే తెలుసా...? అందుకేనా ఎస్కేప్‌...!

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై గ‌ళం వినిపించాల్సిన జ‌న‌సేనాని ప‌వ‌న్ మౌనం వ‌హించారు.ఇది భావ్య‌మా?  ఇది అన్యాయం కాదా?  ఆయ‌న ఓట్ల కోస‌మే రాజ‌కీయం చేశారా?  ఇలాంటి నేత .రాజ‌కీయాల‌కు అవ‌స‌ర‌మా? ఇదీ.ప్ర‌స్తుతం ఏపీలో వివిధ సామాజిక మాధ్య‌మాలు.వెబ్‌సైట్ల‌లో వ‌స్తున్న వార్త‌లు, కామెంట్లు! నిజ‌మే.ఇప్పుడు ప‌వ‌న్ మౌనం వ‌హించారు క‌నుక‌.కీల‌క స‌మ‌యంలో మాట్లాడాల్సిన నాయ‌కుడు నోరు విప్ప‌క‌పోవ‌డం పై ప్ర‌తి ఒక్క‌రిలోనూ అస‌హ‌నం క‌ట్ట‌లు తెగుతోంది.దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు.
కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితి.ఏపీ ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు.ప‌వ‌న్‌కు ముందుగానే తెలుసున‌ని.కేంద్రం ఏం చేయాల‌ని అనుకుంటుందో కూడా ఆయ‌న‌కు మూడు నెల‌ల ముందుగానే విష‌యం వివ‌రంగా తెలుస‌ని అంటున్నారు ఢిల్లీ పెద్ద‌లు.

 Jansena Pawan Kalyan Silence Over Ap Politics, Ap Politics, Pawan Kalyan, Bjp, Y-TeluguStop.com

అందుకే ఆయ‌న ఇప్పుడు మౌనం పాటిస్తున్నార‌ని చెబుతున్నారు.ప్ర‌స్తుతం పోల‌వ‌రం ర‌గ‌డ ఊపందుకుంది.

రాజ‌ధాని విష‌యంలో కేంద్రం పాత్ర‌ను త‌గ్గించేసుకుంది.విశాఖ నుంచి రైల్వే జోన్‌ను ఉప‌సంహ‌రించుకుంది.

Telugu Amaravathi, Ap, Jansenapawan, Pawan Kalyan, Ys Jagan-Telugu Political New

ఇలా అనేక విష‌యాల్లో కేంద్రం మౌనం పాటిస్తోంది.ఇవి.మ‌న‌కు ఇప్పుడు తెలుస్తున్నాయి.కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న త‌ర్వాత‌.

ఆయా విష‌యాల‌పై ప‌వ‌న్‌కు ఉప్పందింద‌నే విష‌యం కూడా ఇప్పుడే బ‌య‌ట‌కు వ‌చ్చింది.నిజానికి బీజేపీ ప‌వ‌న్ లాంటి వ్య‌క్తితో పొత్తు పెట్టుకోవ‌డం వెనుక వ్యూహం కూడా ఇదేన‌ని అంటున్నారు.

ఈ విష‌యాల‌న్నీ ఆయ‌న‌తో చ‌ర్చించార‌ని, ఏపీకి ఉన్న స‌మ‌స్య‌లు.కేంద్రం ఇచ్చేవి.

ఇవ్వ‌ని కూడా ఆయ‌న అప్ప‌ట్లోనే చెప్పార‌ని అంటున్నారు ఢిల్లీ పెద్ద‌లు.

ఈ విష‌యాలు ఆయ‌న‌కు తెలియ‌ని కావ‌ని… అయితే, విభేదించినా.

కేంద్రం ఎలాగూ చేయ‌దు క‌నుక‌.రాజ‌కీయంగా జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారో చూడాల‌నే వ్యూహంలో భాగంగానే ప‌వ‌న్ పొత్తుకు సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు.

సో.ఇప్పుడు ప‌వ‌న్ మౌనం వెనుక చాలా రోజుల కింద‌టే స్కెచ్ సిద్ధ‌మైంద‌నేది వాస్త‌వం అంటున్నారు.ఇక‌, ఇప్పుడు తేలాల్సింది.జ‌గ‌న్ స‌త్తానే! ఆయ‌న గెలిస్తే.రాజ‌కీయాలు మార‌తాయి.లేకుంటే.

మ‌ళ్లీ ప‌వ‌న్ పుంజుకోవ‌డం ఖాయం అంటున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube