'గిన్నిస్ బుక్...లోకి జనసేన..?     2018-10-11   15:50:20  IST  Surya

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ పర్యటన చివరి అంకాన్ని ఎంతో భారీగా ప్లాన్ చేస్తున్నారు.. ధవళేశ్వరం మీదుగా మొదలయ్యే జనసేన కవాతు ధవళేశ్వరం బ్రిడ్జ్ దాటడంతో తూగో జిల్లాలోకి ఎంటర్ అవనుంది. ఈ కవాతుతో దేశం మొత్తం దద్దరిల్లాలని ఒక రికార్డ్ క్రియేట్ చేయాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ శ్రేణులకి పిలుపుని ఇచ్చారు..తూగో జిల్లా , పగో జిల్లా సత్తా ఏమిటిలో తెలియాలంటే కవాతు తో టీడీపీ నేతల్లో వణుకు పుట్టాలని తెలిపారు..అంతేకాదు తాజా సమాచారం ప్రకారం ఓ భారే రికార్డ్ ని జనసేన పార్టీ క్రియేట్ చేయనుందని తెలుస్తోంది.

ఒక వైపు దేవీ నవరాత్రులు జరుగుతున్న తరుణంలో జనసేనాని పూర్తి నిరాహార దీక్షతో చేస్తూ ధవళేస్వరం బ్రిడ్జ్ ని దాటడం అంటే సామాన్యవిషయం కాదు కవాతు ప్రారంభం అయ్యో మధ్యలో పవన్ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది కూడా ఈ క్రమంలో ఎంతో అలిసి పోయే పవన్ కళ్యాణ్ కవాతు కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొంటారోనని అభిమానులు పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి.

ఇదిలాఉంటే పవన్ తన అభిమానులు..పార్టీ నేతల కలిసి భారీ సంఖ్యలో చేపట్టబోయే కవాతు కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేయాలని..అవకాశం ఉన్నంతలో గిన్నిస్ బుక్ లోకి చోటు సంపాదించేలా పవన్ ‘జనసేన’ భారీ ప్రయత్నాలు చేస్తోంది…అంతేకాదు ఈ ఒక్క కవాతు కార్యక్రమంతో రాజకీయ నేతల్లో గుబులు పుట్టేలా చేయాలనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది..చంద్రబాబు పై విమర్శలు ఎక్కుపెడుతూనే పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానాలు పంపుతోంది..

అంతేకాదు జనసేన కవాతు అనంతరం జనసేన పార్టీలో చేరికలు భారీగా ఉండేలా వ్యుహాలని సైతం సిద్దం చేసి ఉంచారట..తూగోలోకి ఎంటర్ అవగానే వైసీపీ, టీడీపీ ల నుంచీ కీలక నేతలు..ఒక్కొక్కరుగా జనసేనలోకి క్యూ కట్టనున్నారని తెలుస్తోంది.. ఇప్పటికే చాలా మంది నేతలు జనసేన తీర్ధం పుచ్చుకోవాలని అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ వారి పూర్తి వివరాలతో కూడిన ప్రొఫైల్ పార్టీలో సీనియర్స్ తో స్క్రూటినీ చేయించి గానీ పార్టీలోకి ఆహ్వానం పలకడం లేదట దాంతో కవాతు ఎప్పుడెప్పుడు అవుతుందానని నేతలు వేచి చూస్తున్నారు