పవన్‌కు ఆ సినిమా సెట్ కాదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 Pawan Kalyan Should Not Do That Movie, Pawan Kalyan, Pspk28, Driving License, Re-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ క్రమంలో తమిళ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ను తెలుగులో పవన్ రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కాకుండా మరో మలయాళ చిత్రాన్ని కూడా పవన్ రీమేక్ చేస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్రానికి అక్కడ సూపర్ రెస్పాన్స్ లభించింది.

విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడు.కానీ ఈ సినిమాలో పవన్‌ను హీరోగా తీసుకుంటాడనే వార్తతో మెగా ఫ్యాన్స్‌తో పాటు పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో హీరో పాత్రకు ఎక్కువగా ఎలివేషన్స్ లేకపోవడంతో పవన్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ అలాంటి సినిమా చేయకపోవడమే మంచిదని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి పవన్ ఈ సినిమాను చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

అటు వకీల్ సాబ్ చిత్రాన్ని లాక్‌డౌన్ పూర్తి కాగానే రిలీజ్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube