“అమిత్ షా” కే “షాక్” ఇచ్చిన పవన్ రిప్లై     2018-01-30   21:06:19  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ నెల విడిచి సాము చేస్తున్నాడు ఎప్పుడో కిందపడి మూతి పళ్ళు రాలగొట్టుకుంటాడు అని అంటున్నారు బీజేపి నేతలు..పవన్ దూకుడికి కళ్ళెం వేయాలని భావిస్తున్న బిజెపికి ఇది సాధ్యమేనా అంటే అయ్యే పని కాదు అందుకే వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతోంది..టిడిపిని దూరం పెడుతూ పవన్ ని దెగ్గర చేసుకుంటోంది..అయితే పవన్ మాత్రం బీజేపి ఎత్తులని సాగనివ్వను అనేలా వ్యవహరిస్తున్నారు..

అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో యాత్రని ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న పవన్ కి “బీజేపి బిగ్ బాద్ షా” “అమిత్ షా” నుంచీ ఫోన్ వచ్చిందట..అయితే ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే పవన్ అమిత్ షా కి బిగ్ షాక్ ఇచ్చాడట దాంతో ఏమి చేయాలో తెలియక అమిత్ షా నోరెళ్ళబెట్టారని అంటున్నారు..అయితే అమిత్ షా ఏమన్నారు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు అంత షాకింగ్ న్యూస్ అమ్మయ్యి ఉంటుంది అంటే..

పవన్ టూర్ సక్సెస్ అయ్యింది కాబట్టి విషెస్ చెప్పాలని బీజేపి జాతీయ అధ్యక్షుడు “అమిత్ షా” పవన్ కి ఫోన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో పవన్ చేసిన యాత్ర గురించి మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులను చర్చించడానికి ఈ మేరకు ఢిల్లీ వచ్చి తనతో కలవవలసినదిగా పవన్ ను అమిత్ షా ఫోన్లో ఆహ్వానించారట అయితే..అసలే పవన్ కళ్యాణ్ అంటే కొంచం తిక్కెక్కువ దాంతో పవన్ లయన్ ఈ విషయంపై పెద్దగా స్పందించకుండానే..నేను త్వరలో ఢిల్లీ వచ్చి ప్రధాని ని కలుస్తాను ఇక్కడ ఉన్న సమస్యలపై చర్చించి వెళ్ళే సమయంలో మిమ్మల్ని కలిసి వెళ్తానని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడట.

ఒక జాతీయ పార్టీ నాయకుడు ఆహ్వానించినా వెళ్లకుండా మోడీని కలిసినపుడు కలుస్తా అని అనడంపై…బీజేపి పై తన వైఖరి ఏంటో అర్థం అవుతోంది అంటున్నారు విశ్లేషకులు…అయితే పవన్ కళ్యాణ్ బీజేపితో కలిసి నడిచే అవకాశం లేదని అంటున్నారు..ఇదిలా ఉంటే అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడుదాం రండి అంటున్నారంటే ఎదో భారీ స్కెచ్ ఉందని అంటున్నారు విశ్లేషకులు..మరి పవన్ అమిత్ షా ని కలుస్తాడా లేక ప్రధానిని మాత్రమే కలిసి వచ్చేస్తాడా అనేది పెద్ద ప్రశ్న గా మారింది.