సంచలన నిర్ణయం దిశగా పవన్ కళ్యాణ్..   Pawan Kalyan Shocking Decision     2018-02-07   21:16:00  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేస్తున్నారా..? అయితే ఆ నిర్ణయం మార్చుకోండి అని పరోక్ష సందేశాలు వెళ్తున్నాయి..త్వరలో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ పవన్ కనుకా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం నిజంగానే అటు మోడీ కి ఇటు జగన్ కి చుక్కలు కనపడటం ఖాయం అంటున్నారు..ఇంతకీ పవన్ కళ్యాణ్ తీసుకునే ఆ నిర్ణయం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది..

కొన్ని రోజుల క్రితం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ‌డ్జెట్‌పై పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు..ఓ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటి వరకూ ఖండన లేదు..అసలు పార్టీ ఎందుకు పెట్టాడో కూడా ఎవరికీ తెలియదు..పార్ట్ టైం పొలిటికల్ లీడర్ అంటూ ఎన్నో విమర్శలు చేశారు..అయినా ఇప్పటి వరకూ పవన్ ఈ విషయంలో నోరు మెదపలేదు అంతేకాదు త్వరలో రెండో సారి యాత్ర చేస్తాను అంటూ లేఖ విడుదల చేశారు..అయితే ఆ లేఖలో ఎక్కడా కూడా బ‌డ్జెట్‌పై నోరు మెదపలేదు..దాంతో అందరు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్తాయిలో మండి పడ్డారు..అయితే త్వరలో పవన్ కళ్యాణ్ గర్జించబోతున్నారు అని తెలుస్తోంది.ఢిల్లీ గల్లీ లో పవన్ కళ్యాణ్ తన గళం వినిపించానున్నారు అని టాక్..

ఢిల్లీలో వేదిక‌గా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న జ‌న‌సేనాని త‌న కొత్త అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ట‌…పవన్ చేపట్టబోయే కార్యక్రమం ఏంటంటే “నిరాహార దీక్ష‌”…ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..జనసేన తీసుకున్న సంచలన నిర్ణయంగా జనసేన వర్గాలు తెలుపుతున్నాయి..ఇప్ప‌టిదాకా మోదీ ప్ర‌సంగాన్ని విని, ఏపీకి ఏద‌యినా న్యాయం చేస్తార‌ని ఆస‌క్తిగా ఎదురుచూసిన పవ‌న్‌కి ఆ ఆశ ఏదీ క‌నిపించ‌లేద‌ట‌. దాంతో పార్ల‌మెంట్ సమావేశాలు జ‌రుగుతుండ‌గానే ఏపీకి ప్ర‌త్యేక హోదా విషయంలో ఢిల్లీ లో గళం విప్పాలని భావిసున్నారు.

ఇదిలా ఉంటే పవన్ తీసుకునే ఈ నిర్ణయంతో వైసీపి కి తీవ్రమైన నష్టం కలుగుతుందని..ఇప్పటికే బ‌డ్జెట్‌పై గట్టిగా మాట్లాడలేక పోతున్న వైసీపి అధినేత జగన్ రెడ్డి కి ఇప్పుడు పవన్ తీసుకునే నిర్ణయం మాత్రం చాల గట్టి దేబ్బగానే చెప్పాలి..ఇప్పటి వరకూ జగన్ ప్రత్యెక హోదా అని అన్నా కానీ దానిపై ఒక్క సారి కూడా గట్టిగా మాట్లడలేదు..అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం జగన్ రాజకీయంగా పెద్ద దెబ్బకోడుతుందని విశ్లేషకుల అభిప్రాయం..మరి పవన్ నిజంగానే ఈ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తాడా లేదో వేచి చూడాల్సిందే.