ప్లీనరీ లేదు..పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం     2017-11-20   22:25:30  IST  Bhanu C

రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి రానంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కి వచ్చింది…ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ..వారి సమస్యల పరిష్కారాల దిశగా అడుగులువేస్తూ..సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. తన బలం ఏంటో రాష్ట్రస్థాయిలోనే కాదు కేంద్ర స్థాయిలో కూడా నిరూపించుకుని..ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన జెండా ఎగురవేస్తున్నాడు..

ఇటీవలే అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీ పవన్‌ కల్యాణ్‌ను గౌరవించిన సంగతి తెలిసిందే..దాని తరువాత వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ సందర్భంగా ఎక్స్‌ లెన్స్‌ అవార్డుతో ఐఈబీఎఫ్‌ గౌరవిస్తోంది. ఈ సంవత్సరం ఆ అవార్డును పవన్‌ కల్యాణ్‌కు రావడంతో పవన్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఇదిలా ఉంటే లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ నేతలతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు

ప్రజలతో మమేకం అయ్యి..వారి మధ్య ఉండి సమస్యలని తెలుసుకుంటూ నియోజక వర్గాల వారీగా రిపోర్ట్ లు తెప్పించుకుని ఆ సమస్యల దిశగా ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది..ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాలని చెప్పారట..మొదట త్వరలోనే ప్లీనరీని నిర్వహించి, పార్టీ విధివిధానాలను ప్రజలకు వివరించాలని అనుకున్నా ఇప్పుడు మాత్రం ప్లీనరీ విషయంలో కొంతకాలం ఆగడం మంచిది అని పవన్ భావిస్తున్నారట.

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ పర్యటించడంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ పర్యటన మొదలయ్యే లోగా రెండు తెలుగు రాష్ట్రాలలో సభ్యత్వ నమోదుని వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులని ఆదేశించారట..వచ్చే ఆరు నెలల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమీక్షించుకుని.. వాటిని అమలు చేయాలని తీర్మానించారు.పవన్ యాత్ర అయిపోయిన తరువాత ప్లీనరీ నిర్వహిస్తేనే మంచిది అని..ప్రజల కష్టాలని..వారి భాదలకి అనుగుణంగా జనసేన ప్లీనరీ వేదికగా ఉంటేనే జనసేనకి మైలేజ్ ఉంటుందని అప్పుడే ప్రజలలో జనసేన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని తెలిపారట.. ..ఒక పక్క సీపిఎం..సిపిఐ లాంటి పార్టీలు పవన్ పార్టీతో జతకట్టాలి అంటే వారి విధి విధానాలు తెలిసిన తరువాతే వారితో దోస్తీ చేయాలా లేదా ఆలోచిస్తాము అని అంటున్నారు.లండన్ పర్యటన తరువాత జనసేనాని చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.