పవన్ పై చంద్రబాబు నిఘా..తిప్పికొట్టిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ని వెనక్కి పంపేశారు.మాకు ప్రభుత్వం నుంఛీ ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు అంటూ సున్నితంగా తిరస్కరిచారు.

 Pawan Kalyan Shocking Decision On Chandrababunaidu-TeluguStop.com

అదేంటి మాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి మరీ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు కదా మరి ఇలా ఒక్కసారిగా ఎందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి పెద్ద స్టోరీనే ఉంది ఇంతకీ అసలేమి జరిగింది.ఎందుకు పవన్ ప్రభుత్వ సెక్యూరిటీ వద్దు అని చెప్పారు అనే వివరాలలోకి వెళ్తే.

చంద్రబాబు పై ఎంతో గౌరవం ఉంది ఆయన ముందు చూపు ఏందో ఆదర్సవంతం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా ఎందుకు చంద్రబాబు విషయంలో యూ టర్న్ తీసుకున్నారో మోడీ కే తెలియాలి సరే ఆ విషయం పక్కన పెడితే.పవన్ చంద్రబాబు లోకేష్ ల పై చేసిన అవినీతి ఆరోపణలు ఎంత సంచలనం కలిగించాయో అందరికీ తెలిసిందే అయితే గుంటూరు వేదికగా తండ్రి కొడుకులని దుమ్ము దులిపేశాడు పవన్ అంతేకాదు ఆ తరువాత జనసేన పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మాతో సుమారు 40 మంది టిడిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అంటూ ప్రకటన చేశారు.

దాంతో ప్రభుత్వ విషయాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా కొందరు లీక్ చేస్తున్నారన్న విషయం చంద్రబాబుకు అర్థమయింది.దీంతో టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్లాస్ పీకాల్సి వచ్చింది.

ఇదిలాఉంటే పవన్ తో ఎవరెవరు టచ్ లో ఉంటున్నారన్నది తెలుసుకునేందుకు టీడీపీ నిఘా ఏర్పాటు చేసిందని జనసేనాని కి అనుమానం కలిగింది అసలు లోపల చర్చించుకుంటున్న వ్యవహారాలూ బయటకి ఎలా లీక్ అయ్యాయి అని సందేహం పక్కనే ఉన్న సెక్యూరిటీ మీదకి వెళ్ళింది అంటే వీళ్ళే చంద్రబాబు కి అసలు విషయాలు చేరవేస్తున్నారు అని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ దాంతో నాకు ప్రభుత్వం నుంచీ సెక్యూరిటీ అవసరం లేదు అంటూ తిప్పి పంపేశారు.

ఈ క్రమంలో ప్రభుత్వానికి ఓకే లేఖని కూడా రాసి పంపారు.

ఇప్పటి వరకూ మీరు నాకు చేసిన సాయానికి కృతజ్ఞతలు అంటూ చివరిగా ఫైనల్ టచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఇలా సెక్యూరిటీ ని పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది.

ముందు ముందు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఇంకెన్ని ఘలక్ లు ఇవ్వనున్నాడో వేచి చూడాలి.అయితే పవన్ ఎందుకు సెక్యూరిటీ ని పంపాడో అనే విషయం త్వరలోనే పవన్ మీడియా సమావేశం ద్వారా బహిర్గతం చేయనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube