పవన్ వ్యాఖ్యలతో జుట్లు పీక్కుంటున్న అభిమానులు

పవన్ కళ్యాణ్ అనగానే అందరు చెప్పే డైలాగు ఒక్కటే “నాకు కొంచం తిక్కుంది దానికో లేక్కుంది “ అని అయితే పవన్ కళ్యాణ్ కి తిక్క ఉంది కానీ అది కొంచం కాదు వేపకాయంత వెర్రి అనుకుంటే అది ఇప్పుడు పుచ్చకాయలా మారిపోయింది.రాజకీయాలలో కూడా తన తిక్క తిక్క ప్రదర్సనలు చేస్తూ.

 Pawan Kalyan Shocking Comments..ananthapuram Tour-TeluguStop.com

తిక్క తిక్క మాటలతో అటు ప్రజలని ఇటు అభిమానులని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.వామ్మో వీడెక్కడి నాయకుడురా బాబోయ్ అంటూ హడలిపోతున్నారు జనం.ఇలాంటి వాడు సీఎం అయితే.? ఊచించుకుంటేనే భయమేస్తోంది అంటున్నారు పవన్ కళ్యాణ్ తిక్క ప్రసంగాలు వింటున్న ప్రజలు.

అసలు పవన్ ఏమన్నాడు అంటే అనంతపురం నుంచీ పోటీ చేస్తాను అని ఎప్పుడో చెప్పేశాడు అంతకు ముందు సొంత జిల్లా పశ్చిమగోదావరి నుంచీ అనుకున్నా సరే నేను పోటీ చేసేది అనంతపురమే అని ప్రకటించాడు అయితే అనంతపురం టూర్ ని ప్రకటించడం.అక్కడకి వచ్చి నాకు లక్ష మంది యువకులు అనంతపురం నుంచీ కావాలి అని అనడగడం.

అనంతపురం వెనుకపడిన జిల్లా అని చెప్పడం నేను ఉన్నాను అంటూ డైలాగులు బాబోయ్ ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గెలుపుకోసమే ఇలాంటి డైలాగులు చెప్తున్నాడు అని సోషల్ మీడియాలో కాకై కూసింది.దాంతో పవన్ రూటు మార్చేశాడు.

ఏమన్నాడంటే.

ఏపీ ప్రజల అభీష్టం మేరకు టీడీపీతో పొత్తు విషయం ఆలోచిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు…అంతేకాదు మరోక మాట కి జనాల ఫ్యుజులు ఎగిరిపోయాయి.

అదేంటంటే శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా అభివృద్ధి చేసేవారికే తన మద్దతు అని తెలిపాడు.అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక మొదటగా ప్రభుత్వం టిడిపి ఏర్పడింది టిడిపి ద్వారానే మరి శిలాఫలకాలు వేసి పనులు పెండింగ్ లో పెట్టింది కూడా చంద్రబాబు టిడిపి నే మరి పొత్తు ఎవరికి ఇస్తాడు జనాలకి అర్థం కాలేదు…వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని.

సమయం వచ్చినపుడు ప్రకటిస్తానని అన్నారు…మరి కొన్ని నెలల క్రితం అనంతపురం నుంచీ అని ప్రకటించిన పవన్ ఇప్పుడు రూటు మార్చేశాడు.

కష్టాలు ఎక్కడుంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందన్నారు.

అందుకే అనంతపురాన్ని దత్తత తీసుకున్నానని తెలిపారు.పవన్ కళ్యాణ్ అంటే పరిటాల సునీత అండర్ లో అనంతపురం అభివృద్ధి చెందలేదా.

టిడిపి అభివృద్ధి చేయలేదా.?

నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తన దృష్టికి తెస్తే ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు…అసలు పవన్ ఎవరు ప్రజా సమస్యలు ఆయనకి చెప్తేనే పని అవుతుందా ప్రభుత్వానికి చెప్తే అవ్వదా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి పవన్ అనుకోవాలా లేక టిడిపి ప్రభుత్వం చేతకానిదని.ప్రజా సమస్యలు తెలుసుకోలేని దద్దమ్మలు పార్టీలో ఉన్నారు అనుకోవాలా అసలు పవన్ ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం.అయితే పవన్ పొంతన లేని మాటలు మాట్లాడటం.

టిడిపి ని చేతకాని ప్రభుత్వంగా చిత్రీకరించడం చూస్తుంటే టిడిపి ఫైర్ బ్రాండ్స్ అందరు ఏమయ్యారు అని ప్రశ్న వస్తోంది.అంతేనా పవన్ ని ప్రజా నాయకుడిని చేయడానికి టిడిపి ఓ మెట్టు కిందకి దిగిందా అనే డౌట్ కూడా వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube