ప‌వ‌న్ మ‌ళ్లీ ట్వీటాడు.. వివాద‌మా? ప్ర‌కంప‌న‌మా?       2018-06-22   00:04:23  IST  Bhanu C

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌ళ్లీ ట్వీట్లు చేయ‌డం ప్రారంభించాడు. అప్పుడెప్పుడో.. న‌టి శ్రీరెడ్డి ఉదంతం త‌ర్వాత మౌనం వ‌హించిన ఈ ప‌వ‌ర్ స్టార్‌.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై స్పందించాడు. అయితే, ఈయ‌న స్పంద‌న‌లు అన్నీ కూడా.,. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల‌కు అన్న సామెత‌ను గుర్తుకు తెస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం పోరుయాత్రలో భాగంగా శ్రీకాకుళంలో ప‌ర్య‌టిస్త‌న్న ప‌వ‌న్‌.. రంజాన్‌కు ముందు నుంచి విరామం ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికీ యాత్ర ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో వెల్ల‌డించ‌లేదు. ఇదిలావుంటే, తాజాగా ఆయ‌న రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై స్పందించాడు. అయితే, ఆయ‌న చేసిన ట్వీట్ల‌లో చాలా వ‌ర‌కు గ‌తంలో నాకు అది తెలిసింది.. ఇది తెలిసింది.. అన్న‌ట్టుగా మూస విధానంలోనే సాగ‌డం గ‌మ‌నార్హం.

కొన్నాళ్ల కింద‌ట రాష్ట్రంలో తిరుమ‌ల తిరుప‌తి వివాదం తీవ్రంగా కుదిపేసింది. ప్ర‌ధాన అర్చకుడు ర‌మ‌ణ దీక్షితుల‌ను తొల‌గించ‌డం.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు.. తీవ్ర‌స్థాయిలో వివాదం రేపాయి. అయితే, అప్ప‌ట్లో మాట్లాడ‌ని జ‌న‌సేనాని.. అంతా అయిపోయింద‌ని అంద‌రూ అనుకుంటున్న నేప‌థ్యంలో నోరు తెరిచారు. కొన్నాళ్ళ క్రితం ఓ ఉన్నతాధికారి, టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై తనతో చర్చించారని పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఆ చర్చల సారాంశాన్నితాజాగా ట్వీట్ చేశాడు. ప్రత్యేక విమానం ద్వారా వెంకటేశ్వరస్వామికి చెందిన విలువైన సంపద విదేశాలకు తరలించబడిందని, ఆ విషయం ఆ ఉన్నతాధికారి పవన్‌కళ్యాణ్‌ చెవిన వేశారని పేర్కొన్నాడు.

అలా తరలిపోవడం సంగతి తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలకూ తెలుసన్నది ఆ అధికారి పవన్‌కళ్యాణ్‌కి చెప్పిన విషయమట. !! నిజానికి బాధ్య‌తా యుత నాయ‌కుడు అయి ఉంటే.,. ప‌వ‌న్ అప్ప‌ట్లోనే స్పందించాల్సి ఉంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దాచ‌డం అనేది అనేక అనుమానాల‌కు అవ‌కాశం ఇస్తోంది. ఇక‌, టీటీడీపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి వుందన్నది పవన్‌కళ్యాణ్‌ చెబుతున్న మాట. రమణ దీక్షితులకు ఈ విషయంలో పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ ద్వారా సంఘీభావం తెలిపారు. ఇక‌, ఇటీవ‌ల రెండు రోజుల కిందట రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన క్షుర‌కుల ప‌రిస్థితిపైనా ప‌వ‌న్ చాలా ఆల‌స్యంగా స్పందించాడు. క్షురకుల సమస్యల విషయంలో ముఖ్యమంత్రి దూకుడు ప్ర‌ద‌ర్శించాడ‌ని పవన్‌కళ్యాణ్‌ ఆక్షేపించారు. వారికి బాసటగా వుంటామని ట్వీట్ చేశారు.

ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ కొత్త విష‌యాన్ని వెలుగులోకి తెచ్చాడు. రాష్ట్రంలో అణుక‌ర్మాగారం క‌ట్టాల‌ని కేంద్రం యోచిస్తోంద ని, ఈ విష‌యం అధికార విప‌క్షాలకు తెలుసున‌ని త‌న ట్వీట్ ద్వారా బాంబు పేల్చాడు. నిజానికి అణు విద్యుత్ అంటేనే త‌మిళ‌నాడు గుర్తుకు వ‌స్తుంది. అక్క‌డి క‌ల్ప‌కంలో జ‌రిగిన ఆందోళ‌న‌లు, మార‌ణ హోమాలు గుర్తుకు వ‌స్తాయి. మ‌రి అలాంటి విష‌యంలో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ ఉద్దేశం చెప్పాల‌ని ప‌వ‌న్ ఇప్పుడు తాజాగా ట్వీట్ చేశాడు. నిజానికి ఈ విష‌యంలో వారిని ఇబ్బంది పెట్ట‌డం త‌ప్ప ప‌వ‌న్ సాధించేది ఏమీ లేద‌నిఅంటున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా.. ప‌వ‌న్ ట్వీట్లు.. ఆశ్చ‌ర్యం క‌లిగించ‌డం లేదు స‌రిక‌దా.. హాస్చ్య‌ర్యం క‌లిగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.