బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేసిన 'పవన్ కళ్యాణ్'.! బాలయ్య ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో.?   Pawan Kalyan Sensational Comments On Balakrishnas     2018-11-04   07:29:36  IST  Sainath G

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరగడం దురదృష్టకరమన్నారు.

కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ చేయడం ఫ్లాప్ అయ్యే సినిమా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాహుల్ గాంధీతో చంద్రబాబునాయుడు కలవడాన్ని సినిమా ట్రైలర్‌గా అభివర్ణించిన జనసేనాని.. ఇది ఫ్లాప్ అయ్యే మూవీనే అని అన్నారు.

Pawan Kalyan Sensational Comments On Balakrishnas-

ఆ రెండు పార్టీలు కలయిక వర్కవుట్ కాదని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా ఉండే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడి నుంచి ప్రారంభించారో మళ్లీ అక్కడికే చేరుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan Sensational Comments On Balakrishnas-

రేపు పొద్దున్న జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఒక్కటవ్వచ్చు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాదు బాలకృష్ణపై కూడా ఫైర్ అయ్యారు. బాలకృష్ణ లాగ బూతులు మాట్లాడలేను అన్నారు. ఆ వీడియో మీరే చూడండి!