ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తానన్న పవన్

తెలంగాణలో గతకొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.గురువారం ఆయనను ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు బంజారా హిల్స్ జనసేన కార్యాలయంలో కలిశారు.

 Pawan Kalyan Says He Will Speak With Kcr Over Rtc Strike-TeluguStop.com

ఈ సందర్భంగా ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డితో పాటు ఇతర నేతలు పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.

గత 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం చాలా బాధ కలిగించిందన్నారు.ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపి తగు న్యాయం చేయాలని పవన్ కోరారు.

కార్మికులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని.తాను కేసీఆర్‌తో ఆర్టీసీ సమ్మెపై ప్రత్యేకంగా సమావేశం అవుతానన్నారు.

కేసీఆర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను పట్టించుకోని యెడల కార్మిక సంఘాలకు తన పూర్తి మద్ధతు ఉంటుందని ఆయన అన్నారు.కార్మికుల కోసం జనసేన పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube