ఆ ఫొటోలో పవన్‌ కళ్యాణ్ ఒడిలో ఉన్న ఇప్పటి హీరో ఎవరో గుర్తుపట్టారా..?

పవన్ కళ్యాణ్ పేరులోనే ఉంది పవర్.అందుకే ఆయన్ని అందరు పవర్ స్టార్ అంటారు.

 Do You Remember The Current Hero In Pawan Kalyans Lap In That Photo  Pawan Kalya-TeluguStop.com

పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అందరికి ఫుల్ జోష్. పవర్ స్టార్ ఏమి చేసిన సరే అది ఒక ట్రెండ్ లా ఫాలో అవుతారు అభిమానులు.

మరి పవర్ స్టార్ పుట్టిన రోజు అంటే ఇంకా అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు.ముందు రోజు నుంచే అభిమానుల కోలాహలం మొదలయిపోయింది.

ఒక రేంజ్ లో బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు అభిమానులు.ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం అయన బర్త్ డే గురించి మారుమోగిపోతుంది.

రాత్రి నుంచే విషెస్ మొదలయిపోయాయి.

అలాగే అభిమానులతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక మెగా హీరోలు సైతం పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే మెగా హీరో లలో ఒకరైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఆ ఫోటో సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి ఫోటో.ముద్దుల మావయ్య పవన్ కళ్యణ్ తో దిగిన ఫోటో అది.మామయ్య తో దిగిన తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేస్తూ ఇలా కాస్త వెరైటీ గా విష్ చేసాడు సాయి ధరమ్ తేజ్‌ `అప్పుడూ.ఇప్పుడూ.ఎప్పుడూ… #HBD PawanKalyan mama అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ఫోటో చుసిన అభిమానులు లైక్స్, మెసేజెస్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

ఈ ఫోటో విషయానికి వస్తే సాయి పసివాడిగా ఉన్నప్పటి ఫోటో అది.పవన్‌ కళ్యాణ్ కాలేజ్‌ లో చదివే రోజుల్లో సాయితో ఆడుకుంటున్నప్పటి ఫొటోలా ఉంది.సాయి ధరమ్ తేజ్ కి, పవన్ కళ్యాణ్ కి ఇద్దరికి ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఈ ఫోటో.ఇండస్ట్రీ లో సాయి ధరమ్ తేజ్ కెరీర్ సాఫీగానే సాగుతుంది.

ప్రస్తుతం సాయి ‘ సోలో బ్రతుకే సో బెటర్‌ ‘ అనే సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.మరి ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube