విరూపాక్షలో పవన్ పాత్ర అదేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రీఎంట్రీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

 Pawan Kalyan Role In Viroopaksha, Pawan Kalyan, Viroopaksha, Krish, Telugu Movie-TeluguStop.com

వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాను క్రిష్ తనదైన మార్క్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే అంశం సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.అయితే ఈ సినిమా పీరియాడికల్ మూవీగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టగా, అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ పేదవారికి మంచి చేసే పాత్రలో నటిస్తాడని, అది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాను తమిళ స్టార్ ప్రొడ్యూస్ ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా, హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతున్నారు.మరి ఈ సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉంటుందో, హీరోయిన్ ఎవరో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube