పవన్‌కు అనుకూలంగా ‘పవర్‌ స్టార్‌’ను మార్చిన వర్మ?

రామ్‌ గోపాల్‌ వర్మ ఏ ముహూర్తాన ‘పవర్‌ స్టార్‌’ మూవీని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించాడో కాని అప్పటి నుండి మీడియాలో ఆ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.సినిమా కంటెంట్‌ ఎలా ఉన్నా పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో చేసే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ సినిమా కోసం భారీ స్థాయిలో పబ్లిసిటీ చేశాడు.

 Rgv Power Star Movie Compatible To Pawan Kalyan, Pawan Kalyan, Rgv, Power Star,-TeluguStop.com

డిజిటల్‌ ఫార్మట్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అందుకే భారీ మొత్తంను టికెట్‌ రేటుగా పెట్టిన వర్మ పబ్లిసిటీని పీక్స్‌లో చేస్తున్నాడు.

ఈ సినిమా ట్రైలర్‌ చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమాలో పవన్‌కు వ్యతిరేకంగా చూపించారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.అయితే ఇక్కడే వర్మ ట్విస్ట్‌ ఇస్తున్నాడట.సినిమాను రెండు వర్షన్‌లలో తీసిన వర్మ ప్రచారం జరుగుతున్న వర్షన్‌ను కాకుండా పవన్‌కు పాజిటివ్‌ వర్షన్‌లో విడుదల చేయబోతున్నాడట.అంటే 24 గంటల్లోనే పవన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని పవన్‌ కు సానుభూతి తెలిపే విధంగా పవన్‌ ఫ్యాన్స్‌కు నచ్చే విధంగానే వర్మ మార్చినట్లుగా తెలుస్తోంది.

Telugu Netizens, Pawan Kalyan, Trailer-

వర్మకు వ్యతిరేకంగా పవర్‌ స్టార్‌కు కౌంటర్‌గా పరాన్న జీవి వస్తుంది.ఆ కారణంగానే వర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.అయితే ఇదేదో భయపడి కాదని, ఇది కూడా ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంట్‌ అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వేళ వర్మ నిజంగానే పవన్‌కు మద్దతుగా ఉండేట్లుగా పవర్‌ స్టార్‌ సినిమాను తెరకెక్కించినట్లయితే పవన్‌ ఫ్యాన్స్‌ మద్యలో ఎర్రి పుష్పాలు అయినట్లుగా భావించొచ్చు.

ఫ్యాన్స్‌ ను అలా చేసేందుకు వర్మ ఈ ప్లాన్‌ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.రేపటితో అసలు క్లారిటీ రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube