ప్రజారాజ్యం ప్రతీకారం పవన్ కళ్యాణ్ జనసేనతో తీర్చుకుంటాడా!  

Pawan Kalyan Revenge On Prajarajyam Failures -

ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో కీలక స్థానాలు సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటులో భాగం అవుతామని, జనసేన మద్దతు లేకుండా ఎ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారు.ఇక నాయకులు కూడా ఆ తరహాలోనే అంచనాలు పెట్టుకొని ఉన్నారు.

Pawan Kalyan Revenge On Prajarajyam Failures

ఇక మరో పది రోజులలో ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.ఈ ఎన్నికలలో జనసేన ప్రభావం ఎలా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరే అవకాశాలు ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వెనుక కొందరు కీలక నేతలు ఉన్నారనే విషయం కళ్యాణ్ కి మొదటి నుంచి తెలుసు.అది కూడా చిరంజీవికి సన్నిహితంగా ఉండేవారు, అలాగే చిరంజీవి అండతో రాజకీయంగా ఎదిగిన నేతలు ఉన్నారని బలంగా నమ్ముతున్నారు.

ఈ ఎన్నికలలో అలా ప్రజారాజ్యం ఫెయిల్యూర్ వెనుక ఉన్న వ్యక్తులని ఎలా అయిన రాజకీయంగా దెబ్బ తీసి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే ఆలోచనతో వారు పోటీ చేసిన స్థానాలలో గట్టి ప్రత్యర్ధులని నిలబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.జనసేన ప్రభావం కారణంగా ఈ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవితో ఉన్న నేతలకి ఓటమి తప్పదు అనే మాట గట్టిగా వినిపిస్తుంది.

ఇక వారిని ఓడించి రాజకీయంగా దెబ్బ తీయడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పంతం నెగ్గించుకునే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు