మళ్ళీ ఉద్యమ గళం విప్పిన జనసేనాని... ఎల్జీ బాధితులకి అండగా

లాక్ డౌన్ తర్వాత పొలిటికల్ గా కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరల మునుపటి వేగం అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో తరుచుగా జిల్లాల వారీగా జనసేన నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ స్థానిక పరిస్థితులని అడిగి తెలుసుకుంటున్నారు.

 Pawan Kalyan Responds Vizag Gas Leak Victims, Lock Down, Janasena, Ap Politics,-TeluguStop.com

ఈ నేపధ్యంలో తాజాగా విశాఖలోని జనసేన నేతలతో ఆయన ముచ్చటించారు.ఈ సందర్భంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన, విశాఖలో ప్రభుత్వ భూమి, ఆస్తుల అమ్మకాలపై చర్చించారు.

అలాగే పెరిగిన కరెంటు బిలులు, డాక్టర్ సుధాకర్ ఘటన మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఎల్జీ పాలిమర్స్ బాధితుల అంశంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.గ్యాస్ లీక్ బాధితులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.జిల్లాలోని స్థానిక నాయకులు గ్యాస్ లీక్ బాధితులకి జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వాలని సూచించారు.అంతేగాకుండా, పేదలను మభ్యపెట్టకుండా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు.ప్రభుత్వ ఆస్తుల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలపై క్షేత్రస్థాయి నుంచి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇటీవల సస్పెండైన డాక్టర్ సుధాకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube