అంతర్వేది ఘటనపై న్యాయ విచారణ చేయండి... పవన్ కళ్యాణ్ సలహా

ఒక మతం టార్గెట్ గా గత కొంత కాలంగా ఏపీలో తరుచుగా సంఘటనలు జరుగుతున్నాయి.మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఘటనలు జరుగుతున్న, వాటి వెనుక కుట్ర కోణం ఉందని మత సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న అసలు ప్రభుత్వం ఏ మాత్రం వాటి మీద ఫోకస్ చేయడం లేదని ఆ సంఘటన వెనుక కారణాలని చూపిస్తూ ఉంటే అర్ధమవుతుంది.

 Pawan Kalyan Responds On Antarvedi Chariot Burning Issue, Janasena, Antarvedi,-TeluguStop.com

ఈ విషయంలో అధికార పార్టీ కొంత వరకు ప్రజాగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక ఇలా జరుగుతున్న వరుస సంఘటనలు, తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం మంటల్లో కాలిపోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

పిచ్చివాడు చేసిన పని అని, తేనె పట్టు కోసం మంట పెడితే రథం కాలిపోయిందని చెబుతున్నారని, ఈ కారణాలు వింటే పిల్లలు కూడా నవ్వుతారని అన్నారు.

పిఠాపురం, కొండబిట్రగుంట ఘటనల తర్వాత నేడు అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన యాదృచ్ఛికం కాదని, ఏదైనా బలమైన మోటో తో చేస్తున్నట్లే కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.

యాదృచ్చికంగా జరిగిన సంఘటనలు అయితే ఇలా వరుసగా జరగవని అన్నారు. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఎవరో పిచ్చివాడు చేసిన పని అంటూ తేల్చేశారు, ఆ ఘటనని సీరియస్ గా తీసుకొని ఉంటే ఈ రోజు రథం దగ్ధం చేసే వరకు పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం పడ్డారు.

వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై మౌనంగా ఉండలేమని స్పష్టం చేశారు.హిందూ మతానికి సంబంధించి ఏదైనా మాట్లాడితే మతవాదులు అనే ముద్ర వేయడం బాల్యం నుంచి చూస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చిందని తెలిపారు.ఈ సంఘటన ఒక్క మతానికి అని ఈ రోజు వదిలేస్తే, మిగిలిన మతాలపై ఇలాంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని, అప్పుడు మత సామరస్యం పూర్తిగా దెబ్బ తింటుంది అని తెలిపారు.

అంతర్వేది ఘటనపై న్యాయవిచారణ చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube