అయోధ్య తీర్పుపై జనసేనాని స్పందన ఏంటీ?

హిందూ మరియు ముస్లీంల మద్య ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతున్న వివాదంకు నేడు సుప్రీం కోర్టు ఒక ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది.హిందువులు భావిస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా అయోధ్యలో రాముడు జన్మించాడంటూ సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు ముస్లీంల మనోభావాలను కూడా కాపాడుతూ ఇరు వర్గాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది.

 Pawan Kalyan Respond On The Ayyodhya Rama Mandhir Judgement-TeluguStop.com

ఈ తీర్పుపై ప్రముఖుల అంతా కూడా స్పందిస్తున్నారు.ఇది దేశ ప్రజల విజయం అని, ఒక సామాజిక వర్గందో లేదా మతంకు చెందిన వారిదో కాదు అంటూ అంతా అంటున్నారు.

ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా అయోధ్య తీర్పు విషయమై తన స్పందన వినిపించాడు.ఆయన మాట్లాడుతూ… ఇరు వర్గాలకు సాంత్వన కలిగించేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నాం.

భారత న్యాయవ్యవస్థకు స్వచ్చమైన దర్పణం అంటూ పవన్‌ పేర్కొన్నాడు.ధర్మాన్ని పరిరక్షించేలా ఈ తీర్పు ఉంది అంటూ పవన్‌ పేర్కొన్నాడు.

మనమంతా భారతీయులం అని, ప్రతి ఒక్క భారీతీయుడు కూడా ఈ తీర్పును గౌరవిస్తారని ఆశిస్తున్నాను.భారత్‌ మాతాకీ జై అంటూ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube