ఓడిపోయిన పాతికేళ్ళ రాజకీయం ప్రజలతోనే! పవన్ కళ్యాణ్ ఆసక్తికర వాఖ్యలు  

జనసేన ఓటమిపై స్పందించిన పవన్ కళ్యాణ్. .

Pawan Kalyan Respond On Janasena Failure-janasena Failure,pawan Kalyan Respond,tdp,ysrcp

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఘోర పరాభవం మూటకట్టుకున్నాడు. కనీసం కొన్ని డబుల్ డిజిట్ స్థానాలలో గెలుస్తామని ఆశించిన జనసేనానికి ఊహించని ఫలితం ఎదురైంది. కేవలం ఒక్క సీటుకె పరిమితమైంది..

ఓడిపోయిన పాతికేళ్ళ రాజకీయం ప్రజలతోనే! పవన్ కళ్యాణ్ ఆసక్తికర వాఖ్యలు-Pawan Kalyan Respond On Janasena Failure

ఇక అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఓడిపోయాడు. ఇక ఎన్నికల ఫలితం మొత్తానికి వైసీపీకి అనుకూలంగా వచ్చేసింది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ముందుకి వచ్చాడు.

ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.ఎన్నికలలో ఓడిపోయినందుకు బాధపడటం లేదని, ప్రజాభిప్రాయం గౌరవిస్తా అని స్పష్టం చేసారు. ఇక తమ పార్టీ మీద అభిమానంతో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా పాతికేళ్ళ ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయడంలో ముందుకెల్తా అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఎన్నికలలో గెలిచినా పార్టీ ప్రత్యేకా హోదా తీసుకొస్తుందని, అలాగే బీజేపీ పార్టీ ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. ఇక ఏపీ ప్రత్యేక హోదా, అభివృద్ధి కోసం చేసే పోరాటం కొనసాగిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.