పవన్ వకీల్ సాబ్ సినిమా కోసం షాకింగ్ రెమ్యూనరేషన్..!

పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న సినిమా వకీల్ సాబ్.మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతుండగా ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Pawan Kalyan Remuneration For Vakeel Saab-TeluguStop.com

వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 Pawan Kalyan Remuneration For Vakeel Saab-పవన్ వకీల్ సాబ్ సినిమా కోసం షాకింగ్ రెమ్యూనరేషన్..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.బాలీవుడ్ లో పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు.

ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ భారీ లెవల్లో ఇస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా మొత్తం నిడివి 155 నిముషాలు ఉంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జరీ చేసారు.ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించబోయే నిడివి పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ సినిమాలో పవన్ స్క్రీన్ స్పేస్ 50 నిముషాలు ఉంటుందట.

ఒరిజనల్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా తక్కువుగా ఉంటుంది.

కానీ తెలుగులో కొన్ని సీన్స్, ఫైట్స్ యాడ్ చేయడం వల్ల ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 50 నిముషాల పాటు కనిపించబోతున్నాడు.అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తుంది.50 నిముషాల్లో కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.

#Pink Remake #PawanKalyan #Vakeel Saab #PawanKalyan #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు