జనసేన అభ్యర్ధుల 'మొదటి లిస్టు' ఇదేనా..!  

Pawan Kalyan Released First List Of Candidates Of Janasena-

 • తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పండుగ దగ్గర పడిపోతోంది.తెలంగాణలో ముందస్తు ఎఫెక్ట్ తో అక్కడ ఎన్నికల తేదీలని సైతం ఖరారు చేసేశారు దాంతో మహాకూటమి మొదలు అన్ని పార్టీలు సీట్ల సర్దుబాటుల్లో అభ్యర్ధుల అసంతృప్తుల బ్రతిమిలాటలో కొట్టుమిట్టాడుతున్నాయి.

 • జనసేన అభ్యర్ధుల 'మొదటి లిస్టు' ఇదేనా..!-Pawan Kalyan Released First List Of Candidates Of Janasena

 • ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు తెలంగాణా కంటే కూడా ఏపీలో ఎన్నికల పోరుపైనే అందరి దృష్టి ఉంది అయితే ఎన్నికలకి ఇంకా సుమారు ఆరునెలల సమయం ఉండటంతో ఎవరికీ వారు అభ్యర్ధుల విషయంలో పెద్దగ తొందరపాటు పడటం లేదు.అయితే

  Pawan Kalyan Released First List Of Candidates Janasena-

  పార్టీల మధ్య పొత్తులు ఉంటాయా లేదా.అనే విషయం పక్కన పెడితే ముందుగా ఎవరికి వారు అభ్యర్ధుల విషయంలో తలమునకలై ఉన్నారు.

 • ఏపీలో ప్రధాన పెద్ద పార్టీలుగా ఉన్న తెలుగు దేశం వైసీపీలు అభ్యర్ధుల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంటే జనసేన పార్టీ మాత్రం ఇంకా చర్చల విషయంలోనే మునిగిపోయింది అయితే తూగో నుంచీ పితాని బాలకృష్ణ ని ప్రకటించిన పవన్ తరువాత అభ్యర్ధుల వివరాలు ఎక్కడ బయట పెట్టలేదు అయితే పవన్ పార్టీలో తొలి అభ్యర్ధుల జాబితా సిద్దమయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న వార్త ఒకటి హల్చల్ చేస్తోంది.అయితే ఈ లిస్టు లో బీజేపీ, వైసీపీ కి సంభందించిన నేతలు ఉండటంతో.

 • పొత్తులో భాగమా.లేక జనసేన లోకి ఆ నేతల జంప్ చేశారా అనే సందేహం వ్యక్తమవుతోంది.

 • జనసేన అభ్యర్ధుల మొదటి లిస్టు లో ఆరుగురు ఎంపీ తిమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. “విజయవాడ” నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త “పొట్లూరి వరప్రసాద్‌” , గుంటూరు నుంచి “లింగమనేని రమేష్‌” , మచిలీపట్నం నుంచి పవన్ అన్నయ్య నాగబాబు, గతంలో ప్రజారాజ్యం నుంచీ పోటీ చేసి ఓడిపోయిన తోట చంద్రశేఖర్‌ -ఏలూరు , ఒంగోలు నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ నుంచి ‘సోము వీర్రాజు’లు పార్లమెంట్‌ అభర్యులుగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది…అంతేకాదు విజయవాడ తూర్పు నుంచి కోగంటి సత్యం విజయవాడ సెంట్రల్‌ నుంచి వంగవీటి రాధా, కి టిక్కెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది…

  Pawan Kalyan Released First List Of Candidates Janasena-

  ఇక నందిగామ నుంచి జాన్‌ వెస్లీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌, మైలవరం నుంచి కాజా రాజకుమార్‌, గుంటూరు-2 నుంచి లేళ్ల అప్పిరెడ్డి , రాజమండ్రి నుంచీ ఆకుల సత్యనారాయణ, కొత్తపేట నుంచి , నల్లా పవన్‌కుమార్‌, పర్చూరు నుంచి “దగ్గుబాటి వెంకటేశ్వరరావు” పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నుంచీ మల్లుల లక్ష్మీనారాయణ, పాలకొల్లు నుంచీ చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ పేరు వినిపిస్తున్నాయి…అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందనేది పక్కన పెడితే వీరిలో కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటికే పవన్ పరిశీలనలో ఉన్నాయని అంటున్నాయి జనసేన వర్గాలు.