పవన్ రీల్ హీరో .. జగన్ రియల్ హీరో ! ఇదిగో సాక్ష్యం !       2018-05-26   02:43:39  IST  Bhanu C

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు .. జగన్ చేస్తున్న పాదయాత్ర చూసి అతడికి వస్తున్న ప్రజాధారణ తనకు కూడా రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా నుంచి పాదయాత్ర చేపట్టాడు. అయితే.. తెర మీద జీవితానికి .. తెర వెనుక జీవితానికి చాలా తేడా ఉంటుంది అని … రాజకీయం అంటే రెండు స్టెప్పులు వేసి .. రెండుగంటలు రెస్ట్ తీసుకోవడం కాదని ఇప్పుడు పవన్ కి బాగా తెలిసొచ్చింది. పాదయాత్ర చేస్తే .. కాళ్ళు మండుతాయి.. ఒళ్ళు హూనం అవుతుంది. ఓపిక అంతా పోతుంది. అయినా దృఢమైన సంకల్పం ఉంటే… ఇవన్నీ చిన్న చిన్న సమస్యల్లాగానే కనిపిస్తాయి.

ఇప్పుడు జగన్ – పవన్ యాత్రలకు ఉన్న తేడా చూసుకుంటే… పవన్ తెరపైన మాత్రమే హీరో..రియల్ లైఫ్‌లో మాత్రం జీరో అని నిరూపించేసుకుంటున్నాడు. అంతెందుకు మొన్నామధ్య కాలి నడకన తిరుమల కొండ ఎక్కినప్పుడు కూడా పవన్ శారీరక సామర్థ్యం ఏంటో అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు పోరాటయాత్ర పట్టుమని నాలుగురోజులు చేసాడో లేదో అప్పుడే కుంటిసాకులు చెప్తూ వాయిదా వేసేశాడు.

భగ భగ మండే వేసవిలో వారంలో ఒకరోజు విరామం తప్ప దాదాపుగా 280 రోజుల నుంచి జగన్ నిరంతరంగా యాత్ర చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజల్లో మంచి జోష్ నింపుతున్నాడు. కానీ పోరాటయాత్ర అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ మాత్రం రెండు మూడు రోజులకే అలసిపోయాడు. గత రెండు రోజులుగా పూర్తిగా గెస్ట్ హౌస్‌కే పరిమితమయ్యాడు పవన్. సెక్యూరిటీ కారణాలు చెప్పి జనసేన వర్గాలు తప్పించుకున్నప్పటికీ … శారీరకంగా పవన్ ఎండలను తట్టుకోలేకపోయాడని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నాడని పవన్ ఉన్న గెస్ట్ హౌస్ సిబ్బంది బయటకు లీకులు ఇస్తున్నారు.

ప్రస్తుతం జగన్ కూడా ఆంధ్ర ప్రాంతంలోనే పాదయాత్ర చేస్తూ ఉండడం ఇఫ్పుడు పవన్-జగన్‌ల రియల్ లైఫ్ హీరోయిజం గురించి గోదావరి జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. తెరపైన పవన్ హీరోయిజం ఎలా ఉన్నా….నిజ జీవితంలో మాత్రం ప్రజల మధ్యన, ప్రజల కోసం ఎండా, వాన లెక్క చేయకుండా పోరాడడంలో మాత్రం జగనే సిసలైన హీరో అనే మాటలు వినిపిస్తున్నాయి.