సినిమాలో ముఖ్యమంత్రి అవ్వబోతున్న పవన్ కళ్యాణ్! అది పూరీ మార్క్  

pawan kalyan reel cm for puri jagannath movie - Telugu Janasena, Mega Family,, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిపోయినట్లు తెలుస్తుంది.

 Pawan Kalyan Reel Cm For Puri Jagannath Movie

ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశాడు.

ఈ రెండు సినిమాలలో పూరీ మార్క్ లో పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేశాడు.ఇక పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలిసిన పూరీ జగన్నాథ్ అతనితో తీసే సినిమాలలో ఒరిజినాలిటీని బయటకి తీసుకొచ్చి చూపిస్తాడు.

ఈ నేపధ్యంలో మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఓ వైపు పొలిటికల్ గా బిజీ గా ఉంటూనే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

పింక్ సినిమాతో పాటు, క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు పూరీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని పూరీ జగన్నాథ్ ముఖ్యమంత్రి పాత్రలో చూపించాబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే దీనికి సంబందించిన కథ కూడా సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ ని వినిపించడం జరిగిందని, అతను ఒకే చెప్పడం కూడా జరిగిపోయినట్లు టాక్.నిజ జీవిత సంఘటనలని స్పూర్తిగా తీసుకొని పూరీ ఈ కథని సిద్ధం చేసాడని తెలుస్తుంది.

అయితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది తెలియాలంటే మాత్రం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

#Mega Family #PawanKalyan #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan Kalyan Reel Cm For Puri Jagannath Movie Related Telugu News,Photos/Pics,Images..