అలా జరిగితే పవన్ కళ్యాణ్ ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవుతాడో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒక నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా, వ్యక్తిగా కూడా ఎంతో మంది ప్రజల మనసులను గెలుచుకున్నాడు.

 Pawan Kalyan, Tollywood, Hero, Injustice,latest Tollywood News-TeluguStop.com

ఓవైపు సినిమాలలో మరోవైపు రాజకీయాలలో అంతేకాకుండా సహాయం కోరిన వ్యక్తులకు వెంటనే సహాయం అందించడంలో మంచి పేరు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్.ఇక ఈయన కొన్ని విషయాల్లో బాగా రియాక్ట్ అవుతుంటాడు.

ప్రస్తుతం రీఎంట్రీతో వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు పవన్.ఇదిలా ఉంటే పవన్ వ్యక్తిత్వం గురించి పవన్ సరసన నటించిన నటీ నటులు చాలామంది చాలాసార్లు మీడియా ముందు బయట పెట్టారు.

ఇక తాజాగా సినీ నటుడు సివిఎల్ నరసింహరావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా అందులో పవన్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.పవన్ కు అన్యాయం జరిగిందని తెలిస్తే వెంటనే వైల్డ్ గా రియాక్ట్ అవుతాడని తెలిపాడు.

సమాజంలో జరిగే వ్యతిరేకం గురించి లేదా కొన్ని సమస్యల గురించి పవన్ కళ్యాణ్ ముందు వెళ్లి మాట్లాడితే వెంటనే ఆయనకు ఏదైనా చెయ్యాలని ఉంటుందని తెలిపాడు.అలా కొన్ని విషయాలలో బాగా రియాక్ట్ అవుతూ ఏమైనా చేయాలని ముందుకు వచ్చాడని తెలిపాడు.

ఇక పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.అంతేకాకుండా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Telugu Cvl Simha Rao, Harihara, Krish, Pawan Kalyan, Tollywood-Movie

వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా ఉండగా తాజాగా ఈ సినిమాకు భవదీయుడు.భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఇక రమేష్ వర్మ దర్శకత్వంలో కూడా మరో సినిమాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.అంతే కాకుండా మరో ఇద్దరు దర్శకులతో కూడా మరో కొత్త ప్రాజెక్టులతో ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

మొత్తానికి పవన్.తన అభిమానుల ముందుకు వరుస సినిమాలతో రానున్నాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube