అనంతపురం రోడ్డు ప్రమాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan Reacts To Anantapur Road Accident Pawan Kalyan, Anantapur Road Accident , Pawan Kalyan, Dharmavaram

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి విషయంలో ప్రజల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇదే సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేకమార్లు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం జరిగింది.

 Pawan Kalyan Reacts To Anantapur Road Accident Pawan Kalyan, Anantapur Road Acci-TeluguStop.com

రోడ్లపై గుంతలు కూడా పుడ్చలేని ప్రభుత్వమని మండిపడ్డారు.కాగా ఈరోజు అనంతపురం( Anantapur ) జిల్లాలో ధర్మవరం సమీపంలో ఆటో ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రహదారి భద్రత చర్యలపై దృష్టి సారించాలని.

తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ లో  “నిండు నూరేళ్లు జీవించవలసిన వాళ్లు హఠాత్తుగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమే కాకుండా చాలా బాధాకరం.

ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో గత రాత్రి జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధ కలిగింది.కూలీనాలీ చేసుకుని బత్తలపల్లి గ్రామం నుంచి ధర్మవరానికి వస్తున్న వీరు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం శోచనీయం.

Telugu Anantapur Road, Dharmavaram, Pawan Kalyan, Pawankalyan-Telugu Political N

సరైన రవాణా మార్గాలు లేకపోవడం వల్ల గ్రామాల నుంచి పట్టణాలు రావడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు.వారికి బస్సు సౌకర్యం ఉండి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు.వారి ప్రాణాలు నిలబడేవి.ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ధర్మవరం జనసేన నాయకులు మృతుల కుటుంబాలకు అండగా నిలబడ్డారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.రహదారి భద్రత చర్యలపై దృష్టి పెట్టాలి.

ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మార్గాలు అన్వేషించాలి.గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలు రావడానికి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలి.

అశువులు బాసిన వారి కుటుంబాలకి ప్రభుత్వం ఉదారంగా ఆర్ధిక సహాయం అందించాలి.గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్సలు చేయించాలి.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube