పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ టైటిల్‌ ఏంటో తెలుసా?  

Do You Know Pawan Kalyan Re-entry Movie Title-chiru 152th Movie,janasena,nagababu,pawan Kalyan,pawan Kalyan Re-entry Movie Title,tollywood Boxoffice,tollywood Gossips,ys Jagan

అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు నో చెబుతూ వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవంను చవిచూశాడు.పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగాలనుకున్న పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా ఎక్కువ పని లేకపోవడం వల్ల మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.పవన్‌ హీరోగా ఆ సినిమా తెరకెక్కబోతుంది.

Do You Know Pawan Kalyan Re-entry Movie Title-chiru 152th Movie,janasena,nagababu,pawan Kalyan,pawan Kalyan Re-entry Movie Title,tollywood Boxoffice,tollywood Gossips,ys Jagan Telugu Tollywood Movie C-Do You Know Pawan Kalyan Re-Entry Movie Title-Chiru 152th Janasena Nagababu Pawan Re-entry Title Tollywood Boxoffice Gossips Ys Jagan

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నాయి.చాలా భారీ ఎత్తున ఈ చిత్రంకు గాను పవన్‌ పారితోషికం తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.బోణీ కపూర్‌ ఈ సినిమా రీమేక్‌ను నిర్మిస్తున్నాడట.ఇక తాజాగా బోణీ కపూర్‌ ఈ సినిమా కోసం లాయర్‌ సాబ్‌ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడట.

పవన్‌ కళ్యాణ్‌ ఈ చిత్రంలో లాయర్‌ పాత్రను చేయబోతున్నాడు.మొదటి సారి పవన్‌ లాయర్‌ పాత్ర చేయబోతున్న కారణం అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ కేవలం 35 నుండి 40 రోజుల పాటు మాత్రమే ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడట.రోజుకు భారీ పారితోషికంను ఇవ్వడంతో పాటు సినిమా లాభాల్లో వాటాను సైతం పవన్‌కు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, అందుకే పవన్‌ ఆర్ధిక అవసరాల కోసం సినిమాను చేసేందుకు ఒప్పుకున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

జనవరిలో సినిమా పట్టాలెక్కబోతుంది.వచ్చే వేసవిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారట.