పవన్ నో అంటే ఆ క్రేజీ ఆఫర్ రవి తేజకి దక్కినట్లే...

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత “వకేల్ సాబ్” అనే చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.అయితే వచ్చి రావడంతోనే పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.

 In Case Pawan Dint Accept That Offer Ravi Teja Will Take Over It  Pawan Kalyan,-TeluguStop.com

ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి నటువంటి షూటింగు పనులు పూర్తి కూడా చేశాడు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్  ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఓ వార్తా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే తమిళంలో మంచి విజయం సాధించినటువంటి విక్రమ్ వేద అనే చిత్రాన్ని తెలుగులో టాలీవుడ్ కి సంబంధించినటువంటి ఓ ప్రముఖ సినీ దర్శకుడు రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట.అంతేగాక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటింపజేయడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని సంప్రదించి స్క్రిప్ట్ కూడా వినిపించాడట.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరో పక్క చేతిలో మరో రెండు కొత్త ప్రాజెక్టులు ఉండటంతో తనకు కొంత కాలం పాటు సమయం కావాలని చెప్పాడట.దీంతో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఈ చిత్రంలో నటించడానికి నో చెబితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్థానంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజను తీసుకోవాలని అనుకుంటున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ నో  చెప్పినటువంటి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్ చిత్రాలలో రవితేజ నటించి మంచి హిట్ కొట్టాడు.దాంతో పవన్ నో చెబితే ఈసారి రవితేజకి హిట్ ఖాయమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నమరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube